తెలుగుపాఠకులకు చిరపరచితమైన కథానవలా రచయిత్రి తురగా జయశ్యామల. జీవిక రీత్యా ముంబయ్‌ వాసి. వరుస రచనలతో ఒక తరం తెలుగుపాఠకులను ఉర్రూతలూగించారామె. మూడు నాలుగు దశాబ్దాలనాటి ఆమె రెండు నవలికల సమాహారం ‘కాలమిచ్చినతీర్పు, పెళ్ళి పందిరి’ పుస్తకం. ఇప్పటికీ ఇవి కాలానుగుణ్యమైనవే. తన గుమ్మంలో వడిలేసిన ఆడశిశువును ప్రేమతో పెంచి పెద్దచేసి ఆమె జీవితాన్ని తీర్చిదిద్దడం కోసం పరితపించిన విశ్వం మాస్టారి కథ ‘కాలమిచ్చిన తీర్పు’. పునర్వివాహంతో స్ర్తీ సంరక్షణకోసం తపించే పురుషులుంటారన్న వాస్తవాన్ని చెప్పే నవలిక  1977లో జ్యోతి మాసపత్రికలో వచ్చిన నవలిక ఇది.

మరొకనవలిక,1987లో వనితాజ్యోతిలో సీరియల్‌గా వచ్చింది‘పెళ్ళిపందిరి’. నమ్మిమోసపోయే స్ర్తీల జీవితానికి అద్దంపట్టే నవల ఇది. భరత్‌లాంటి మేకవన్నె పులులు పూజ లాంటి స్ర్తీలను ఎలావెంటాడతారో, అలాంటి భరత్‌లు చివరకు ఏమవుతారో చెప్పే కథ. కాగా 12 కథలున్న మరో పుస్తకం ‘అనుకోలేదని..’.దాదాపు మూడు దశాబ్దాలనాటి సామాజిక పరిస్థితులు, ఆనాటి మనుషుల ఆలోచనలు, అనుబంధాలు, ఆత్మీయతలను కళ్ళకు కట్టే కథలివి.

కాలమిచ్చిన తీర్పు, పెళ్ళి పందిరి
తురగా జయశ్వామల
ధర 150 రూపాయలు
పేజీలు 186

అనుకోలేదనీ.....
తురగా జయశ్యామల
ధర 100 రూపాయలు
పేజీలు 76
ప్రతులకు రచయిత్రి, ఫ్లాట్‌ నెం 706, ఆరాధన ‘బి’ వింగ్‌, జి.డి.అంబేద్కర్‌ రోడ్‌
దాదర్‌, ముంబయి–14 మరియు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలోని అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు