సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు రచయిత. తన రచనలతో సమాజాన్ని రిపేరు చేసేవాడు రచయిత. విరించి కలంపేరిట ప్రసిద్ధికెక్కిన తల్లాప్రగడ గోపాలకృష్ణ కథలు చదివితే ఇలాగే అనిపిస్తుంది. 25 కథలున్న విరించి ఈ తాజా పుస్తకంలోని కథలు చదివితే మనం ఎదుర్కొనే, మనకు తెలియని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. టైటిల్‌కథ ‘సహనాభవతు’ ట్విస్టులమీద ట్విస్టులతో సాగేకథ. ఇంటిని చక్కదిద్దే ట్రబుల్‌షూటర్‌గా ఇందులో అమ్మలుపాత్ర మనల్ని ఆకట్టుకుంటుంది.
విరించి
ధర 150 రూపాయలు
పేజీలు 264
ప్రతులకు సాహితి ప్రచురణలు, 29–13–53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట,
విజయవాడ–02, ఫోన్ 0866–2436643