తల్లిదండ్రులకు అండ

ఈ భూమ్మీదకు ఓ కొత్త ప్రాణిని తీసుకురావడం... అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అణువంత ప్రాణం కడుపులోపడిన దగ్గర్నుంచీ... తప్పటడుగులు వేయడం వరకు, శిశువును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. ఆ యత్నానికి తోడుగా నిలుస్తుందీ పుస్తకం. గర్భిణులు ఆహార, వ్యవహారాలలో పాటించాల్సిన నియమాలతో మొదలై... నవజాత శిశువుల అవయవాలతీరు, వాళ్ల స్నానపానాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాల మీద కీలక సమాచారం అందిస్తుంది. పసిపిల్లలకు వచ్చే వ్యాధులు, కాలానుగుణంగా ఇప్పించాల్సిన టీకాల గురించీ అవగాహన కల్పిస్తుంది. తల్లిపాల అవసరం, వాటిని అందించే సందర్భంలో ఏర్పడే సమస్యల మీద అరుదైన విశ్లేషణ కనిపిస్తుంది. శిశువైద్యంలో అపారమైన అనుభవం ఉన్న డా.రమేష్‌రెడ్డి అందించిన వివరాలు... ఇంటిపెద్ద సూచనల్లా, స్నేహితుడి హెచ్చరికల్లా కన్నవారికి తోడుగా నిలుస్తాయి.

శిశు సంరక్షణ (వ్యాసాలు)

రచన: డాక్టర్‌ కర్రా రమేష్‌ రెడ్డి

పేజీలు : 238,

వెల: రూ. 150

ప్రతులకు: ఎమెస్కో ప్రచురణలు