పేదల ఆశల కథలు 

చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మనసు పెట్టెలో దాచి పెద్దయ్యాక తీసి చూస్తే గొప్ప కథలుగా అక్షర రూపం దాలుస్తాయనడానికి తార్కాణమైన కథలివి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ జానపద ఉత్సవం ‘సిరిమాను’ చుట్టూ అల్లుకున్న కథలే ఇవన్నీ. ఇందులోని 15 కథల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒకనాటి గ్రామ సంస్కృతి, మానవ సంబంధాలు, సాంస్కృతిక జీవనం, శ్రమ దోపిడి, ఆర్థిక సంబంధాలతో పాటు ఎన్నో అంశాలు చర్చించారు. కథలన్నీ మనల్ని మళ్ళీ ఒకసారి బాల్యంలోకి తీసుకెళ్తాయి. మొక్కులు, ఘటాలు, పులి వేషాలు, మూఢ భక్తి, ప్రజల విశ్వాసాలు... మనసు నిండా గ్రామ వాతావరణాన్ని నింపి పోతాయి. కథల నిండా పర్చుకున్న గోస్తని నది లాంటి ఉత్తరాంధ్ర మాండలికం సరికొత్తగా ఆకట్టుకుంటుంది. పల్లెల్నికూడా ప్రపంచీకరణ చుట్టుముట్టి గ్రామాల స్వరూపాలెంతో మార్పుకు గురవుతున్న సందర్భంలో ఈ కథలు మరోసారి ఉత్తరాంధ్ర గత వైభవాన్ని తెలుపుతాయి. 

- డా. వెల్దండి శ్రీధర్‌ 

సిరిమాను కథలు, రచన: వి. వెంకట్రావు 
పేజీలు: 160, వెల: రూ. 100 
ప్రతులకు: 95501 46514, 92472 35401