విజయనగరంజిల్లా కుసుమూరు అగ్రహార వాసి నరసింహమూర్తి ఇప్పటివరకు 200 కథలు, రెండు నవలలు, అనేక తెలుగు,ఆంగ్ల వ్యాసాలు రాశారు. ఆయన ఐదవ కథాసంపుటి ఈ ‘వీణా వేదనం’. ఇందులోని 22 కథలు చదువుతుంటే ఉద్వేగం, ఆవేదన, ఆలోచన కలిగించి మనల్ని కుదిపేస్తాయి. టైటిల్‌ కథ ‘వీణా వేదనం’ ఒకనాడు వీణల తయారీలో ప్రసిద్ధమైన బొబ్బిలిలో ప్రస్తుత పరిస్థితిని చిత్రించిన కథ. పాఠకుణ్టి తనవెంట లాక్కుపోయే శైలితో మధ్యతరగతి మనస్తత్వాలు, సంఘర్షణలను ఆర్ర్దంగా చిత్రించిన కథలివి. 

 

వీణా వేదనం కథలు
గన్నవరపు నరసింహమూర్తి
ధర 100 రూపాయలు
పేజీలు 152
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430