‘సాహిత్యం నాకు సంస్కారం నేర్పింది, మానవీయ పరిమళం అద్దింది’ అని గర్వంగా చాటిచెప్పే కవి, కథానవలా రచయిత ఎమ్వీ రామిరెడ్డి. ఆయన కేవలం రచయితే కాదు, తండ్రి పేరిట మువ్వా చినబాపిరెడ్డి స్మారకట్రస్టు స్థాపించి వృద్ధులకు, పేద పిల్లలకు సేవలందిస్తున్న ‘సేవా’ పథికుడు, ప్రచురణకర్త కూడా. ఇప్పటివరకు ఆయన మూడు కవితా సంపుటాలు, రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించారు. ఆయన తాజా కథల సంపుటి ‘వెంట వచ్చునది’. 

బిజినెస్‌ ముఖ్యమా? సాటి మనిషి ప్రాణం ముఖ్యమా? అని తూకంలోపెట్టి మనల్ని ప్రశ్నిస్తుంది టైటిల్‌ కథ. అమరావతి రాజధాని నిర్మాణంలో భూములు కోట్లకు పడగలెత్తిన నేపథ్యంలో, కంటికి కనిపించని శత్రుత్వాలు, తగాదాలు, దురలవాట్లు, విచ్ఛిన్నమైన సంబంధాల తీరుతెన్నులను, యదార్థగాథల ఆధారంగా రాసిన స్ఫూర్తినిచ్చే కథలు, ఇందులో మనకు కనిపిస్తాయి.

 

వెంట వచ్చునది
ఎమ్వీ రామిరెడ్డి కథలు
ధర 160 రూపాయలు
పేజీలు 240
ప్రతులకు ఎం.వి.రాజ్యలక్ష్మి, శ్రీకోట రెసిడెన్సీ, మియాపూర్‌, హైదరాబాద్‌–49 సెల్‌ 98 66 777 870
మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు