‘యానాం’ ప్రాణ సఖుడు శిఖామణి (సంజీవరావు). పుట్టిన ఊరు మీద, తన చుట్టూ అల్లుకున్న బాంధవ్యాలమీద విస్తారంగా కవిత్వం రాసిన అరుదైన కవి. మువ్వల చేతికర్ర (1987)తో ప్రారంభించి పది కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన కవిత్వానికి మూల బిందువు మనిషే. అద్భుతమైన భావుకత, సామాజికాంశాలు, విశ్వమానవత పరిమళించిన కవిత్వమిది. మచ్చుకి ‘యానామా! నా ఆరో ప్రాణమా!’ అనే కవిత చూస్తే,‘ఏడేడు ద్వీపాలలో/అందమైన దీపమా/అడిగిన వరాలన్నీ ఇచ్చే/అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపమా/గుక్కపట్టిన బిడ్డనోటిస్తన్యమా/నాకన్న తల్లీ యానామా/.....అన్నపూర్ణలాంటి డొక్కా సీతమ్మ తల్లివి కదా మా యానామా!/ఎన్నటికీ అంటుపడని అడుగంటిపోని నా గోదారమ్మా! నా యానామా!/.....యానామా! నా కవితా ధ్యానమా/....కూలగొట్టిన అంబేద్కర్‌ విగ్రహాల్ని/ఒకటికి పది నిలబెట్టుకుంటున్నట్టు/యానామా!/నా ఆరోప్రాణమా!.....ఇలా సాగిపోతుంది ఈ సంపుటి

ధర :150రూపాయలు,

పేజీలు: 208

ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, బుక్‌హౌస్‌లు,

విజయవాడ, వనోదయ బుక్‌హౌస్‌, హైదరాబాద్‌ మరియు

రచయిత, వెంగళరావునగర్‌, హైదరాబాద్‌–038

సెల్‌ 98 48 20 25 26