సంఘర్షణకు లోను చేసే కథలు
 
తాను పుట్టి పెరిగిన సమాజంలోని కుల, మత, లింగ, ప్రాంత వివక్షతలనూ వాటిలోని వైరుధ్యాలనూ ఎటువంటి నియంత్రణ లేకుండా సూటిగా, స్పష్టంగా పాఠకుల కళ్ళకు కట్టించే కథల సంపుటి అన్వర్‌ ‘బక్రి’. చాలా నిరాడంబరంగా, సరళ శైలిలో కొనసాగే కథారచన అంతిమంగా పాఠకుణ్ని ఒక అంతస్సంఘర్షణలో ముంచేస్తుంది. రచయిత స్వానుభవంలోని ఎరుకను విస్తారంగా పాఠకుల మెదళ్ళకు ప్రసారం చేయించగల బలం ఈ కథలకుంది. పిచ్చిది, బక్రి ఆకుపచ్చని స్వప్నం, అమెరికా టు వరంగల్‌ వంటివి విలక్షణమైన కథలు. కొన్ని కథల్లో ‘వ్యాస అంశ’ను తగ్గంచి ఉంటే అవి మరీ మంచి కథలయ్యుండేవి. ఈ సంపుటికి అక్బర్‌ బొమ్మలు, జిలుకర శ్రీనివాస్‌ విశ్లేషణాత్మక వ్యాసం ఒక అదనపు ఆకర్షణ.
- డా. డి. లెనిన్‌

 

 

 

బక్రి, అన్వర్‌
పేజీలు : 140, వెల : రూ.80
ప్రతులకు : 98660 89066,
ప్రముఖ పుస్తక కేంద్రాలు