బంధాలకు చిరునామా

ఇప్పటి తరానికి... ఎలాంటి విపత్తును అయినా ఎదుర్కొనేందుకు కావల్సిన జీవననైపుణ్యాలను నేర్పుతున్నాం. కానీ సాటి మనిషితో ఎలా మెలగాలన్న సామాజిక నైపుణ్యాల గురించి అవగాహన కల్పిస్తున్నామా... ఏమో! ఇలాంటి పుస్తకాలు ఆ కొరతను తీర్చుతాయనడంలో సందేహం లేదు. తల్లిందండ్రులు, అత్తాకోడళ్లు, స్నేహితులు... ఎవరితో ఎలా మెలగాలో సోదాహరణంగా చెబుతారు రచయిత. సినిమాలు, పుస్తకాలు, చరిత్ర, పురాణాలు, స్వీయానుభవాలు... ఇలా అన్నింటినీ ఉటంకిస్తూ సాగుతుందీ రచన. ప్రతి అధ్యాయం చివరా జోడించిన వాస్తవ గాథలు, అందులోని సారానికి సాక్ష్యంలా నిలుస్తాయి. ఒకప్పటి సిలబస్‌లలో నైతిక శాస్త్రం కూడా భాగంగా ఉండేది. ఆ అదృష్టానికి నోచుకోని నేటి చదువులకి ఇలాంటి పుస్తకాలే అండ.
- కె.ఎల్‌.సూర్య
 

బంధాలు అనుబంధాలు (వ్యాసాలు)

రచన: ఎం. వెంకటేశ్వరరావు

పేజీలు: 168, వెల: రూ.90

ప్రతులకు: 81210 98500