చేను గట్టుపై కవితా తోరణం 

‘చెరువును రెక్కల మీద ఎగరేసుకుపోవాలని/ఆ పిట్ట ఏవో పథకాలు పన్నుతోంది’ అంటూ నెపం కాసేపు పిట్ట మీద వేస్తాడు గానీ, నిజానికి ప్రసాదమూర్తి కవిత్వం పాఠకులను అక్షరాల రెక్కలపై ఎత్తుకుపోతుంది. ‘చేనుగట్టు పియానో’లో కవిత్వమే కాదు, కవిత్వం పైన కూడా కవితలున్నాయి. ‘కన్నీళ్ళు అక్షరాలుగా మరిగించి/అక్షరాలను అన్నం మెతుకులుగా ఉడికించి/నీ కోసం వణుకుతున్న చేతులతో/నేను లేని శూన్యంలో కూడా కంచం తుడుస్తూ ఉంటాను’ అంటూ రోహితను తలచుకుంటాడు. సొంత ఊరు, స్నేహితులు, సముద్రమూ ప్రధాన కవితా వస్తువులైనా, సామాజిక సంఘటనలపైన కూడా సున్నితంగా స్పందిస్తాడు. ‘చెరువుని మొలకు చుట్టుకుని/ చెట్టెక్కిన జ్ఞాపకాలు’, ‘ఉదయంపూట వానలా వచ్చాడు/ చిన్ననాటి సంగతులన్నీ/చల్లగాలిలో మూటగట్టి’ తెచ్చిన స్నేహితుడు, ‘పిల్ల మబ్బులు అల్లరి అలలై/ కేరింతలు’ కొట్టే సముద్రం, ‘నిన్న చనిపోయిన రైతు/మొన్న చనిపోయిన రైతులా నవ్వుతూ/ ఈ రోజు చనిపోయిన రైతులా’ భయపెట్టడం వంటి ఎన్నో వైవిధ్యమైన స్వరాలను అలవోకగా పలికిస్తాడు. 
- దేరా 

చేనుగట్టు పియానో

ప్రసాదమూర్తి

పేజీలు : 143

వెల : రూ.100

ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు