నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత!
కార్టూననేది పాఠకుల చంకల్లో వేళ్లుపెట్టి గీరకూడదు. బొమ్మ చూడగానే భళ్లున నవ్వు ఎగదన్నుకు రావాలి. దాదాపు సరసి కార్టూన్లన్నీ ఈ తరహావే. అది రాజకీయం కావచ్చు - రాజులవి కావచ్చు, వంటింటివి కావచ్చు - వకీలువి కావచ్చు... మనం ఊహించని ఇరుకుల్లోకి మెలికలా దూరి హాస్యాన్ని రాజేయగల చతురుడాయన. నిలువెల్లా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే తప్పించి వేయలేని కార్టూన్లివి. సరసి వెలువరించిన కార్టూన్ల పుస్తకాల్లో ఇది నాలుగవది. బోల్డన్ని కార్టూన్లతో పాటు ‘లంకెజాడీల’నే పుంతలదేశపు కుంతలరాజు బొమ్మల చరిత్ర మనకొక బోనస్. మీలో నవ్వగల ఓపిక ఉండాలే గాని, మిమ్మల్ని వెంటాడి, వేటాడి నవ్వించగల సత్తా ఈ కార్టూన్లకుంది.
- గొరుసు
సరసి కార్టూన్లు - 4
పేజీలు : 176
వెల : రూ.130
ప్రతులకు : 94405 42950