అతడిని చూస్తే ఆమెకు భయం కలుగుతోంది. కానీ తప్పదు. అతడికి లొంగిపోతోంది. కోరుకున్నప్పుడల్లా ఆమె అతడి కోరిక తీరుస్తోంది. ఆమె అయిష్టంగా తనకు ఒళ్ళు అప్పగిస్తోందని అతడు గ్రహించాడు. ఆమెకు తనమీద నిజమైన ప్రేమపుట్టాలి, ఆమెను శాశ్వతంతా తన సొంతం చేసుకోవాలి, ఎలా? అని ఆలోచించాడు. అందుకోసం అతడేంచేశాడు? అతడామెను తన సొంతం చేసుకోగలిగాడా?
సమయం ఉదయం తొమ్మిది.‘పిలిబీత్’ పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ జగ్‌వీర్‌సింగ్ పోలీస్ రికార్డులు పరిశీలిస్తున్నాడు.ఇన్‌స్పెక్టర్లు భారతి, మన్వర్‌సింగ్ ఆయన ఎదురుగా కూర్చున్నారు.కేసు విషయమై ముగ్గురు తీవ్రంగా చర్చిస్తున్నారు.అప్పుడే ఓ కానిస్టేబుల్ లోపలికి వచ్చి,‘‘సార్! మాజీ ఎం.ఎల్.ఏ మిమ్మల్ని కలవడానికి వచ్చారు’’ అన్నాడు.‘‘లోపలికి పంపు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ జగ్‌వీర్‌సింగ్.మాజీ ఎం.ఎల్.ఏ లోపలికి వచ్చి కుర్చీ కూర్చుంటూ, ‘‘ఇన్‌స్పెక్టర్‌గారు, మన ఊరి ‘శ్మశానంలో శవం’ పడి ఉందని మా కార్య కర్తలు తెలిపారు. మీకు తెలియజేద్దామని వచ్చాను’’ అన్నాడు.‘‘ధన్యవాదాలు. నేను చూస్తాను’’ అన్నాడు జగ్‌వీర్‌సింగ్.అతడు వెళ్ళిపోయిన వెంటనే జగ్‌వీర్‌సింగ్ తన సబ్–ఇన్‌స్పెక్టర్ భారతి, మన్వర్‌సింగ్‌లతో ఘటనాస్థలం చేరుకున్నాడు.
అప్పటికే అక్కడ గుమిగూడిన జనం పోలీసులను చూడగానే పక్కకు తప్పుకున్నారు.పోలీస్ ఫొటోగ్రాఫర్లు, వేలిముద్ర నిపుణులుకూడా వచ్చి చకచకా తమ పనులు పూర్తిచేశారు. ఘటనా స్థలాన్ని,మృతుడిని క్షుణ్ణంగా పరిశీలించాక ఓ కానిస్టేబుల్‌ను పిలిచి మృతుడి దుస్తులను సోదా చేయమన్నాడు జగ్‌వీర్‌సింగ్.హతుడి జేబులోంచి ఒక మడిచిన కాగితం బయటికి తీశాడు కానిస్టేబుల్. దానిమీద అశోక్‌కుమార్ కటియార్ అని ఉంది. చిరునామా రాసి ఉంది. దానిప్రకారం, వెంటనే సబ్–ఇన్‌స్పెక్టర్ మన్వర్‌సింగ్‌ను ఆ గ్రామానికి పంపాడు జగ్‌వీర్‌సింగ్.
శ్శశానంలో పడిఉన్న మృతుదేహాన్ని స్థానికులెవరూ గుర్తించలేకపోయారు. వేరేచోటనుంచి ఇక్కడికి తీసుకొచ్చి చంపడమో, లేదా చంపి ఇక్కడపారేయడమో చేసిఉంటారనే నిర్ణయానికి వచ్చారు ఇన్‌స్పెక్టర్ జగ్‌వీర్‌సింగ్. శవ పంచనామా తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.మృతుడి జేబులో దొరికిన అడ్రసు ప్రకారం ‘గహలూయియా’ గ్రామానికి వెళ్ళి దర్యాప్తుచేశాడు మన్వర్‌సింగ్. అశోక్‌కుమార్ కటియార్ కోసం ఆరాతీస్తే అతడు ప్రైమరీ స్కూలు టీచర్ అని తేలింది. అయితే అతడు ఆ గ్రామంలో ఉండటంలేదనీ, పీలిబీల్‌లోనే ‘చాందిని’ వీధిలో ఉంటున్నాడని గ్రామస్తులు చెప్పిన విషయాలు జగ్‌వీర్‌సింగ్‌కి తెలియజేశాఉ మన్వర్‌సింగ్.