రాత్రి పది గంటలు. ఆర్తనాదాలు చేస్తూ ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చింది కరోలిన్. ఏమిటి ఏమైందని పక్కింటతను కంగారుగా వచ్చాడు. కట్లు విప్పుకుంటూ ఆవరణలో అటు వైపు చూపించింది కరోలిన్‌వణికిపోతూ. .
అటు చూస్తే, కరోలిన్ అత్తగారు మిర్నా కింద పడిపోయి వుంది. గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా కట్టేసి వుంది. కదిపి చూస్తే కదలిక లేదు. ‘చంపేశారు - ఎటాక్ చేసి చంపేశారు!’ అరవసాగింది 20 ఏళ్ళ కరోలిన్. పోలీసులకి కాల్ చేశాడు. ‘ఓహ్ గాడ్!’ అని షాకయ్యారు పోలీసులు, రక్తసిక్తంగా ఉన్న ఆవిడ శవాన్ని చూసి. ఆస్ర్టేలియాలోని అడొలేడ్ పట్టణం, వేలీ వ్యూ ఏరియాలో ఈ సంఘటన ఎవరికీ నమ్మశక్యం కాలేదు. కరోలిన్ పోలీసులకి చెప్పినట్టు, రాత్రి ఈ ప్రాంతంలో దాడి ఏదీ జరగలేదు. ఒక గుంపు వచ్చి ఇరవై నిమిషాల పాటు దాడి జరుపుతూంటే, చుట్టు పక్కల తెలియకుండా ఉంటుందా? అత్తగారితో ట్రాఫిక్‌లో జరిగిన చిన్న గొడవకి పగబట్టి, ఆ గుంపు ఇంటి మీదకొచ్చి అత్త గార్ని కట్టేసి కొట్టారని చెప్పింది. తననీ ఇంట్లో పెట్టి తలుపేశారనీ, అందుకే అత్తగార్ని కాపాడుకోలేకపోయాననీ కరోలిన్ పోలీసులకి చెప్పిన మాటల్ని నమ్మలేదెవరూ! దాడి అబద్ధమని పోలీసులకి చెప్పేశారు.
మేజర్ క్రైం ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్పీ డెస్ బ్రే, కరోలిన్ పిల్లలు ముగ్గుర్నీ సాలోచనగా చూడసాగాడు...ఫ ఫ ఫహతురాలు మిర్నా చేతికున్న వాచీ తీసి ఫోరెన్సిక్స్‌కి అందించారు అటోప్సీ డాక్టర్లు. ఫోరెన్సిక్ ఎనలిస్టు దాన్ని నమోదు చేసుకున్నాడు. ఎస్పీ డెస్ బ్రే అడిగాడు కరోలిన్‌ని, ‘‘నీ మొబైల్‌లో రాత్రి 7.02 నిమిషాలకి మీ ఆయనతో మాట్లాడినట్టుంది?’’‘‘ఔను, అప్పటికింకా ఎటాక్ జరగలేదు’’‘‘ఎప్పుడు జరిగింది?’’‘‘తొమ్మిదిన్నరకి. ఇరవై నిమిషాలు బీభత్సం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన పది నిమిషాలకి కట్లు విప్పుకుని సరిగ్గా పది గంటలకి బయటపడ్డాను’’‘‘వాళ్ళనే వాళ్ళు ఎవరూ లేరు గనుక, వాళ్ళ ఆనవాళ్ళు నేను అడగదల్చుకోలేదు నిన్ను’’‘‘సాక్షిని నేనొక్కదాన్నే గనుక, నా మాటలు నమ్మరు. నేనే ఈ పని చేసి ఉంటే ఈ పాటికి పారిపోకుండా ఉంటానా?’’