టెక్టివ్ శరత్ వైపు చూశాడు ఇన్‌స్పెక్టర్ విజయ్.‘‘కార్ డ్రైవింగ్‌లో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంది. స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోయాడు పాపం!’’ అన్నాడు విజయ్.శరత్ మాట్లాడలేదు. కారును పరిశీలనగా చూస్తున్నాడు.
చెట్టును డీ కొట్టిన కారు ముందు భాగం మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది.కారువైపు, మెయిన్‌రోడ్‌వైపు మార్చి మార్చి చూసి, ‘‘ఈ కోణంలో వచ్చి కారు మధ్యభాగం చెట్టును డీ కొట్టడం సంభవంగా అనిపించట్లేదు’’ అన్నాడు శరత్.‘‘ఎందుకని?’’‘‘చూడు రోడ్డుమీద, కారు ఎంత వేగంగా వెళుతున్నా, ఎన్ని వంకరలు తిరిగినా సరే ఇలా తాకటం సాధ్యం కాదు. కావాలనే ఎవరో కారును ఇలా చెట్టువైపు నడిపించి తాకించారనిపిస్తోంది’’.‘‘నిన్ను ఏదో క్యాజువల్‌గా ఇక్కడికి పిలిచాలే, ఈ కేసు దాదాపు క్లోజ్ అయిపోయింది’’ అన్నాడు విజయ్ నవ్వుతూ.కారు తలుపు తీసి లోపల పరిశీలించిన శరత్, కారులో దొరికిన వెంట్రుకలను జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్‌లో వేశాడు.
‘‘ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడా?’’’ అడిగాడు విజయ్‌ని.‘‘కారులో ఉన్నది అతడు ఒక్కడే. అతడికి ఇంతకుముందు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చిందట. ఒంటరిగా వెళ్ళొద్దని డాక్టర్ ముందే చెప్పాడట’’.‘‘పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఏముంది?’’‘‘నిన్ను రమ్మన్నది అందుకే. ఆ రిపోర్టు ప్రకారం మరణ కాలానికీ, కారు ప్రమాదం అంచనా సమయానికి కనీసం పది గంటలు తేడా వస్తోంది’!’ చెప్పాడు విజయ్.‘‘సహజ మరణం కాదనిపిస్తోంది. బాగా ఆస్తిపరుడైతే వారసుల గురించి ఆరా తీస్తేమంచిది’’‘చాలామంది వారసులున్నారు. అతడు మరణించాడని వాళ్ళమధ్య గొడవలు మొదలయ్యాయి’’!’‘ఇంటరెస్టింగ్’ అన్నాడు శరత్.‘‘సహజమరణం అనే ఉద్దేశ్యంతోనే ఈ కేసుని సీరియస్‌గా తీసుకోలేదు, కానీ నాకు కూడా ఎందుకో సహజం అనిపించలేదు. నువ్వేమంటావో చూద్దామనే పిలిచాను’’ అన్నాడు విజయ్.