‘డాక్టర్‌, రాత్రి నాకేం ఇంజెక్షన్‌ ఇచ్చారు?’ డాక్టర్‌ జాన్‌ని నిలదీసింది కేండీస్‌. తను డిప్రెషన్‌తో వస్తే, యాంటీ డిప్రెసంట్‌ ఇచ్చానన్నాడు జాన్‌. ‘దానికి అంత మత్తు వచ్చి ఇక్కడే పడిపోతానా?’ మళ్ళీ అడిగిందిఇరవై మూడేళ్ళ కేండీస్‌. అతను మాట్లాడలేదు.‘మత్తులో నాకేం జరిగింది డాక్టర్‌?’అయినా మాట్లాడలేదు.

‘మీరు నన్ను రేప్‌ చేశారా?’మాట్లాడలేదు.‘మిమ్మల్ని కోర్టుకీడుస్తా!’ గట్టిగా అర్చింది.‘షటప్‌, యూ గెటవుట్‌!’’ అని తోసేశాడు.నేరుగా వెళ్లి, పోలీసు కంప్లెయింట్‌ ఇచ్చింది కేండీస్‌. ప్యాంటీ మీద మరకలు చూపించింది. దాన్ని లాబ్‌కి పంపి నిర్ధారించుకుని, డాక్టర్‌ జాన్‌ దగ్గరికొచ్చారు పోలీసులు.‘మీ మీద రేప్‌ కంప్లెయింట్‌ దాఖలైంది, బ్లడ్‌ శాంపిల్‌ తీసుకోవచ్చా?’‘తీసుకోవచ్చు! అది నా రెప్యుటేషన్‌ పాడు చేయడానికి డ్రామాలాడుతోంది!’ అని అమాయకంగా చెప్పాడు జాన్‌.‘ఎందుకాడుతుంది? మీరామె ఫ్యామిలీ డాక్టర్‌, ఆమెకి పురుడు కూడా పోశారు’.మాట్లాడలేదు డాక్టర్‌ జాన్‌.

లాబ్‌ టెక్నీషియన్‌ అతడి మోచేతి దగ్గర్నుంచి బ్లడ్‌ శాంపిల్‌ తీసుకున్నాడు. పరీక్ష ఫెయిలైంది. ప్యాంటీ మీద మరకలతో డాక్టర్‌ జాన్‌ డీఎన్‌ఏ మ్యాచ్‌ కాలేదు. షాకైంది కేండీస్‌. పశ్చిమ కెనెడా సస్‌ కాచ్యువన్‌ టౌను... అతను డాక్టర్‌ జాన్‌ కారుని ఫాలో అవుతున్నాడు. జాన్‌ ఒక రెస్టారెంట్లోంచి నూడుల్స్‌ తెచ్చుకుని చాప్‌ స్టిక్స్‌తో తిన్నాడు. తిరిగి సాఫ్ట్‌ డ్రింక్‌ కోసం రెస్టారెంట్‌లోకి వెళ్ళాడు. అతణ్ణి కనిపెడుతున్న ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కార్లో పడేసిన చాప్‌ స్టిక్స్‌లో ఒకటి, కర్చీఫ్‌తో పట్టి తీసుకుని మాయమైపోయాడు. కేండీస్‌ అతణ్ణి కలుసుకుని చాప్‌ స్టిక్‌ తీసేసుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా... ప్రైవేట్‌ లాబ్‌కు వెళ్లింది. చాప్‌ స్టిక్‌ మీద లాలాజలం డీఎన్‌ఏ రిపోర్టుతో మళ్ళీ పోలీసుల్ని ఆశ్రయించింది.

పోలీసులు మూడో సారీ జాన్‌ బ్లడ్‌ శాంపిల్‌ పరీక్షించారు. నెగెటివ్‌ రిపోర్టే వచ్చింది‘అబద్ధం!’ ఆ భవనమంతా ప్రతిధ్వనించేలా అర్చింది కేండిస్‌. మళ్ళీ టెస్టు కోరింది. రెండోసారి డాక్టర్‌ జాన్‌ బ్లడ్‌ శాంపిల్‌ తీసుకున్నారు. రెండోసారీ నెగెటివే వచ్చింది.. మూడోసారి బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుని పరీక్షించారు. నెగెటివ్‌ రిపోర్టే వచ్చింది. ఇక కేసు క్లోజ్‌ చేస్తామన్నారు పోలీసులు. దిక్కుతోచలేదు కేండీస్‌కి. ఇదెలా సంభవం? ఎలా? మరెవరు రేప్‌ చేశారు తనని? కాలం గడిచిపోతున్నా సమాధానం దొరక్క తల్లడిల్లిపోతోంది...