నగ్నంగా ఉన్న అతని ఛాతిమీద చేయి వేయగానే ఆమె ఒళ్ళు ఝల్లుమంది.. ఆ స్పర్శకు ఆమె శరీరంలో ఏదో పులకింత.. చప్పున ఆమెను తనమీదకు లాక్కుని గాఢంగా చుంబించాడతను . పెదవులకు ఏదో కొత్తరుచి తగలటంతో మైమరచి పోయిందామె. మెల్లగా ఆమె దుస్తులు ఒక్కటొక్కటిగా తొలగించాడు...అతడి స్పర్శకు, చేష్టలకు కోరికలతో రగిలిపోతూ అతణ్ణి అల్లుకుపోయింది ఆమె. కానీ....

సాయంత్రం ఆరుగంటల సమయం.మసకచీకటి జలపాతమై కురుస్తోంది.ఆరుబయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆ కాలనీవాసులు ఎందుకో అసౌకర్యంగా ఫీలవ్వసాగారు.తమ అ‍సౌకర్యానికి కారణం ఏమిటా అని కొంతమంది ఆలోచనలో పడ్డారు.మరికొందరు ఆ కారణానికి మూలం ఎక్కడా అని అన్వేషణ ప్రారంభించారు.వారి అసౌకర్యానికి కారణం భరింపరాని దుర్వాసన అనీ, బహుశా ఏ ఎలుకో, పిల్లో చచ్చిపోయి ఉంటుందని కాలనీవాసులు మొదట్లో భావించారు. అయితే రానురాను ఆ వాసన పెరిగిపోవడంతో ఆ వాసన ఎక్కడ నుంచి వస్తోందా అని ఆరా తీశారు.చివరికి ఆ వీధిలో ఉన్న రవీంద్ర ఇంటినుంచి ఆ దుర్వాసన వస్తోందని కనుక్కోవడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదుగానీ, ఆ ఇంటి తాళంకప్ప వాళ్ళను వెక్కిరించింది.

రవీంద్ర భార్య సావిత్రికి మూడోకాన్పు. ప్రసవం నిమిత్తం పుట్టింటికెళ్ళింది. రవీంద్ర మరదలు రమ, అతడి ఇద్దరు పిల్లల్ని రెండురోజుల క్రితం చూశామనీ, బహుశా వాళ్ళు కూడా ఊరెళ్ళి ఉంటారనీ ఇరుగుపొరుగువారు అనుకున్నారు.ఉన్నట్టుండి తాళంవేసి ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో పిల్లి లేక కుక్క ఏదైనా చచ్చిపోయిందా? లేకపోతే.....? అని వేరే సందేహంతో ఇరుగుపొరుగువారంతా కలవరపడ్డారు.కొద్దిసేపు తర్జనభర్జనలుపడి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశారు. తమకేదో అనుమానంగా ఉందని చెప్పారు.కబురు అందగానే ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌ పోలీసులను వెంటబెట్టుకుని హడావుడిగా కాలనీకి చేరుకున్నాడు. పోలీసుల్ని చూడగానే అక్కడ గుమిగూడిన జనం చెల్లాచెదురయ్యారు.ఫోన్‌ చేసినవాళ్ళు ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకొచ్చి నిలబడ్డారు. పోలీసులు తాళాలు పగులగొట్టి తలుపులు తెరచారు. ఆ మరుక్షణం ఇంట్లోంచి దుర్గంధం గుప్పుమంటూ బయటికికొచ్చింది.ముక్కులకు జేబురుమాళ్ళు కట్టుకుని లోపలికి అడుగుపెట్టారు పోలీసులు. బెడ్రూమ్‌లో యువతిశవం!