హఠాత్తుగా గోడకూలి మరణించాడు ఇంజనీర్‌ ఈశ్వర్‌. ఇంకా గట్టిపడని ఇటుకల దొంతరపై కాలువేయడంతో ఇటుకలు కదిలి పోవ డంతో గోడ కూలిందనీ, ఇది ప్రమాదమేననీ పోలీసులు నిర్ధారించారు. కానీ ఈశ్వర్‌ అన్నయ్య అవధాని డిటెక్టివ్‌ శరతను ఆశ్రయించాడు. ‘భవన నిర్మాణం క్వాలిటీ విషయంలో నా తమ్ముడు రాజీపడడు. కల్తీ వస్తువులతో భవనం కూలేట్టు కడతాడంటే నేను నమ్మను’ అన్నాడు అవధాని.శరత అతడివైపుచూస్తూ ఆలోచిస్తున్నాడు.అవధాని నిట్టూర్చి ఓ ఉత్తరం శరతకి అందించాడు. ‘నా తమ్ముడు మరణించటానికి ఒక రోజు ముందు రాసిన ఉత్తరం ఇది. నిన్ననే అందింది. ఫోన్‌, ఈ-మెయిల్‌ ఉపయోగించకుండా రహస్యంగా ఉత్తరం రాయడం సందేహం కలిగిస్తోంది. నా అనుమానాన్ని మరింత పెంచింది. తన ఫోను ఎవరో వింటున్నారనిపిస్తోందని, తన మెయిల్‌ ఎకౌంట్‌ హ్యాక్‌ అయినట్టుందనీ, అందుకే ఉత్తరం రాస్తున్నాననీ ఆ లేఖలో రాశాడు. 

తనకేమైనా అయితే, తన ఆస్తి అన్నకు చెందాలని రాశాడు. అందుకు ఎవరైనా వ్యతిరేకిస్తే, ఆస్తినంతా అనాథ శరణాలయానికి ఇవ్వాలనీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి తన భార్యకు చెందకూడదనీ రాశాడు. నిండా నలభై ఏళ్లు లేకముందే ఆస్తి, వారసుల గురించి మాట్లాడాడంటే వాడిది సహజ మరణం కాదనిపిస్తోంది.’ చెప్పటం ముగించాడు అవధాని.‘కేసు టేకప్‌ చేస్తాను. వివరాలు నా అసిస్టెంట్‌ రాముకి ఇవ్వండి’ అన్నాడు శరత.ఆయన వెళ్ళాక రామూని పిలిచాడు శరత.

‘రామూ అవధాని నేపథ్యం, అతడి గురించిన వివరాలు సేకరించు’.‘బాస్‌.... మృతుడి అన్నయ్యనే అనుమానిస్తున్నావా?’‘ఎవరి నుదుటి మీదా నేరస్థుడని రాసి ఉండదు. నిర్థారణ అయ్యేదాకా అందరూ అనుమానితులే. హ్యాండ్‌రైటింగ్‌ ఎనలిస్ట్‌ హరీ్‌షకి ఈ లెటర్‌ పంపించు’ చెప్పాడు శరత.‘ఆయన పోయిన బాధలో నేనుంటే ఆయన అన్న ఆస్తికోసం ఆరాటపడుతున్నాడా?’ కళ్ళు ఎర్రబడుతుండగా అడిగింది ఈశ్వర్‌ భార్య గౌరి.‘మీ ఆయనకు ఎవరిమీదో అనుమానం ఉంది. మీతో ఎప్పుడైనా చెప్పారా? పైగా ఆయన మరణం వల్ల లాభం మీకే! అందుకే ప్రథమ అనుమానితులు మీరే అవుతారు’ అన్నాడు శరత.