‘‘ఏం చేస్తామమ్మా? ఆ స్వామీజీ తెలియనే తెలియదని అంటున్నాడు. మీ అమ్మగారు ఎక్కడుందో తెలిసే ఒక్క ఆధారమూ దొరకడం లేదు...’’ బెంగుళూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నిస్సహాయంగా చెప్పాడు. ఇది ఒప్పుకోనట్టు చూసింది మోడల్‌ సబా.

‘‘మళ్ళీ డెలివరీకి మా అమ్మ లండన్‌ వెళ్లిందని చెప్పాడు స్వామీజీ. ఆమెకి పంపమని రెండు చీరలు, బర్త్‌ డే కార్డు ఇచ్చాను. చూస్తే ఒక చీర, బర్త్‌ డే కార్డు స్వామీజీ దగ్గరే వున్నాయి. రెండో చీర ముంబాయిలో చూశాను. ఆ చీర కట్టుకున్నామెతో పెళ్లికొచ్చాడు స్వామీజీ’’‘‘ఎవరామె’’‘‘ఏమో, కొత్తామెని పట్టాడు. మా అమ్మని ఏం చేశాడో తెలియడం లేదు!’’ఫ ఫ ఫబెంగుళూరులోనే రిచ్‌మండ్‌ రోడ్‌ బంగళాలో వుంటున్నాడు స్వామి శ్రద్ధానంద.‘‘నీ భార్య కన్పించడం లేదని కంప్లెయింట్‌ కూడా ఇవ్వలేదు నువ్వు. నిజం చెప్పు, ఎక్కడుందామె?’’ అంటున్న ఇన్‌స్పెక్టర్‌ని తేలిగ్గా చూశాడు.‘‘మీరేం చేసినా చెప్పేదింతే, నాకేం తెలీదు!‘’ అని మొండికేశాడు. తల్లి షాకెరా కోసం చెయ్యని ప్రయత్నం లేదు ముంబాయి మోడల్‌ సబా.

మూడేళ్ళు గడిచిపోయినా ఏ మాత్రం ఆచూకీ లభించడం లేదు. ఆమె డెలివరీ కోసం లండన్‌ వెళ్ళిందనేది అబద్ధం. అమ్మమ్మ ఆమె కిచ్చిన ఆస్తులను స్వామీజీ అనుభవిస్తున్నాడు. ముంబాయిలో ఇంకొకామెతో గడుపుతున్నాడు. పలుకుబడి ఉపయోగించుకుని, కేసులో ఇరుక్కోకుండా చూసుకుంటున్నాడు. ఎలా నిజం తెలుసుకోవాలి, ఈ స్వామీజీ నుంచీ?ఫ ఫ ఫఅక్బర్‌ మీర్జా చెబుతున్నదంతా ఓపిగ్గా విన్నాడు పోలీసు ఉన్నతాధికారి కెంపయ్య.‘‘మీ భార్య షాకెరా మీ నుంచి విడాకులు తీసుకుని స్వామీజీని పెళ్లి చేసుకున్న మూడేళ్లకి కన్పించకుండా పోయింది. అంతేనా? చూసుకుంటాను.

స్వామీజీ కంటే మీరెక్కువ పలుకుబడి గలవారు. తేల్చేస్తాను’’ - టార్చర్‌ స్పెషలిస్టు కెంపయ్యకి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ఒంటికన్ను శివరాసన్ని పట్టుకున్న రికార్డుంది. ఇప్పుడు స్వామీజీని లాకప్‌లో వేసి తన ప్రత్యేక టార్చర్‌ టెక్నిక్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేశాడు. శ్రద్ధానంద తట్టుకోలేక, ‘‘నాకేం తెలీదనేదే నిజం! నిజం! ఇంతకంటే వేరే నిజం లేనే లేదు!’’ అంటూ ఏడ్పు లంకించుకున్నాడు. మొదటిసారి కెంపయ్యకి ఓటమి ఎదురయ్యింది. ఇంకేమైనా చేస్తే లాకప్‌ డెత్‌ అవుతుందని వదిలేశాడు. ఒక డిఫరెంట్‌ అప్రోచ్‌ ఆలోచించాడు.