గుబులు గుబులుగా ఉందిప్లాట్‌ఫాం మీద ప్రయాణికులకి. అతణ్ణి చూస్తేనే భయమేస్తోంది. వీలుంటే ఇప్పుడే చంపి దోచుకునేలా వున్నాడు. ప్లాట్‌ఫాం అంచు మీదికి జరిగి, పట్టాల మీద దూరంగా చూపు సారిస్తున్నాడు... ఎనౌన్స్‌మెంట్‌ వచ్చి చాలాసేపే అయింది...

అప్పుడు ఉన్నట్టుండి కూత వినిపిస్తే ప్రయాణికులు లేచి ముందుకొచ్చారు. ప్లాట్‌ ఫాంని దడదడలాడిస్తూ వచ్చేసింది ట్రైను. ఆ వచ్చేస్తున్నప్పుడు అక్కడున్న అతను, ఆ తర్వాతి క్షణం చూస్తే అక్కడ లేడు... ఎలా ఎక్కేశాడు? ఏ కూపే ఎక్కేశాడు దోచుకోవడానికి ఘరానా దుండగుడు...??మూడు నెలల క్రితం... ముంబయి సమీపంలోని కళ్యాణ్‌లో... ఆదివారం ఉదయం ఏడు గంటలకి, ఒకామె సంచీలో గోధుమలతో పిండిమిల్లు దగ్గర కొచ్చింది. షట్టర్‌ వేసివుంటే, కొట్టి చూసింది. షట్టర్‌ లివర్స్‌ ఇరువైపులా ఓపెన్‌గా ఉండడంతో, బలమంతా ఉపయోగించి పైకి లేపసాగింది. షట్టర్‌ని లేపుతూ అలా లోపలికి చూసిందో లేదో, ఒక్క గావుకేకేసి పరుగు లంకించుకుంది.వింతగా వుంది లోపల.

చుట్టూ మడిలా కట్టిన తెల్లటి పిండి మధ్య నిలకడగా ఎర్రటి రక్తం. పక్కనే సుత్తి. సుత్తి పక్కన పగిలిన తల. మిల్లు ఓనర్‌ రాజ్‌ కుమార్‌ జైస్వాల్‌ శవం... పోలీసులకి అర్థంకాలేదు, ఎందుకీ హత్య? సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.ఆర్‌. పాటిల్‌ వెంటనే దర్యాప్తు చేపట్టాడు.ఫ ఫ ఫనెల తర్వాత... ముంబయి సమీపంలో ముంబ్రా... ఆదివారం తెల్లవారుతుండగా పిండి మిల్లు ముందు కూర్చున్న ఇద్దరు, తడితడిగా ఏదో తగుల్తూంటే, లేచిపోయి చూశారు - షట్టర్‌ కిందనుంచి ఎర్రగా. ‘రక్తం! రక్తం!’ అని భయంతో కేకలు పెట్టారు.అదే వింత.

తెల్లటి పిండితో చుట్టూ కట్టిన మడిలోంచి ప్రవహిస్తున్న ఎర్రటి రక్తం. పక్కనే సుత్తి. సుత్తి పక్కన పగిలిన తల. మిల్లు ఓనర్‌ దేవీలాల్‌ జైస్వాల్‌ శవం... అర్థంకాలేదు పోలీసులకి, ఎందుకీ హత్య? సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్సార్‌ పీర్జాదా వెంటనే దర్యాప్తు చేపట్టాడు.ఫ ఫ ఫఆ మరుసటి నెల... ముంబయి సమీపంలో దహిసర్‌... ఆదివారం ఉదయం అదే వింత చూస్తున్నాడు దహిసర్‌ డివిజన్‌ ఎసీపీ సునీల్‌ దేశ్‌ముఖ్‌. ఈసారి హతుడు ఫూల్‌చంద్‌ యాదవ్‌.