ఆటోవచ్చి అతనిముందు ఆగింది. రతీదేవిలాంటి అందగత్తె ఆటోలోంచి దిగి ఎదురుగా నిలబడి ముసిముసిగా నవ్వింది. ఫిదా అయిపోయాడతను. కళ్ళతోనే ఆమె అందాలు జర్రుకోవడం మొదలెట్టాడు. ఒట్టి చూపులేనా? రెచ్చగొట్టింది ఆమె. నిద్రపట్టడంలేదు తెలుసా? అన్నాడు. ఎందుకో? గోముగా అడిగింది. చెబుతాపద అంటూ ఆటో ఎక్కించి గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందంటే.....
సాయంత్రం ఆరుగంటల సమయం.వీధి దీపాలు వెలిగి రోడ్లన్నీ కాంతివంతమవుతున్నాయి. కార్లు, స్కూటర్లు, వాహనాలు రయ్ రయ్‌న పోతున్నాయి.బస్‌స్టాపుల్లో క్కిక్కిరిసిన జనం. విజయ్ బస్సుకోసం చూస్తున్నాడు.అదే సమయంలో ఓ ఆటో విజయ్ ముందు వచ్చి ఆగింది.అందులోంచి దిగిన వ్యక్తిని చూసి విజయ్ గుండె గొంతుకలో వచ్చింది.తను చూస్తున్నది నిజమా? కలా? అని ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు.అసలే అందగత్తె. ఆ రోజు పనిగట్టుకునిమరీ అలంకరించుకున్నట్టుంది.రెప్పమూయకుండా చూస్తూ ఉండిపోయాడు.ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘‘ఊరికే చూడ్డమేనా? కాఫీకేమైనా తీసుకెళ్ళేదుందా?’’ అడిగింది. ఆమె అందాన్ని కళ్ళతోనే తాగేస్తూ ‘‘ఒట్టి కాఫీయేనా?’’ అన్నాడు విజయ్.
‘నాకైతే కాఫీ చాలుబాబు. నీ విషయం నాకు తెలియదు’’‘‘నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు తెలుసా’’‘‘ఎందుకో?’’ పెదవులు కొరికిందామె.‘‘చెబుతాను పద’’ అన్నాడు విజయ్. దోవలో టాక్సీని పిలిచాడు. ఆమెను ఏ వన్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్ళాడు. టాక్సీ గెస్ట్‌హౌస్‌ముందు ఆగగానే ఆమె కలవరపడ్డట్టు కనిపించింది. డబ్బులిచ్చి టాక్సీని పంపేశాడతను. రూం తీసుకుని ఆమెను గదిలోకి తీసుకొచ్చాడు. సంకోచంగానే గదిలోకి అడుగుపెట్టింది ఆమె. వెంటనే విజయ్ తలుపు మూసి గడియపెట్టాడు.పరువాల బరువులతో బంగారు బొమ్మలా నిలబడింది ఆమె.విజయ్ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు.ఆమె ఎర్రటి పెదవులను అందుకున్నాడు. అతడిమెడచుట్టూ చేతులువేసి మత్తుగా కళ్ళలోకి చూసింది. ఆమెను ఎత్తుకుని మంచంవైపు నడిచాడు.
ఉదయం ఏడు గంటలు.ఘటకేశ్వర్ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ పాండే డ్యూటీలో ఉన్నాడు. సీనియర్ కానిస్టేబుల్‌తో ఏదో కేసు గురించి చర్చిస్తున్నాడు. అంతలో టేబుల్ ముందున్న ఫోన్ మోగింది.ఫోన్ ఎత్తి ‘‘ఇన్‌స్పెక్టర్ పాండే స్పీకింగ్’’ అన్నాడు.‘సార్, నేను సూపర్‌గెస్ట్‌హౌస్ మేనేజర్. మా గెస్ట్‌హౌస్ రూం నెం.69లో ఒక యువకుడి శవం పడి ఉంది. వెంటనే రావాలి’’ అన్నాడు కంగారుగా.