‘సతారా వెళ్లి ఇంకా రాలేదా మీ ఆయనా... మూడ్రోజులైందా...సరేనమ్మా ... ఆయన ఫోటో, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళు’అంటున్న కళ్యాణ్ శివారు ప్రాంతమైన, కొల్సెవాడీ పోలీస్ ేస్టషన్‌అధికారికి వివరాలిచ్చి, సంతకం పెట్టి బయల్దేరిందిఆశా గైక్వాడ్. వారం తిరిగేసరికల్లా సీనియర్ ఇన్‌స్పెక్టర్ కవీగెవిట్ విచ్చేశాడు కేసు కొత్త దర్యాప్తు అధికారిగా,‘ఇటు పడెయ్యండయ్యా ఆ ఫైలూ’ అంటూ.
రియల్టీ డీలర్, ఆశా గైక్వాడ్ భర్త శంకర్ గైక్వాడ్ తూర్పు కళ్యాణ్ తీస్‌గావ్ నివాసి. అక్కడ అతడికున్న పాతిక వేల చదరపు అడుగుల స్థలాన్ని పరిశీలించాడు ఇన్‌స్పెక్టర్ కవి. ‘పదిహేను కోట్లు చేస్తుంది సర్’ అన్నాడు వెంట వచ్చిన సువర్ణ. ‘బిల్డరెవరో తెల్సా?’ అడిగాడు కవి. తెలీదన్నాడు సువర్ణ.శంకర్ ఫోన్ పలకడం లేదు. సతారాలో దర్శించుకొస్తానన్న గుడి దగ్గర సీసీటీవీలోనూ కన్పించలేదు. ఏ లాడ్జిలోనూ దిగలేదు. చివరి సారిగా ఎవరితో మాట్లాడాడో కాల్ రికార్డు తీయించి చూసి, ఈ నంబరెవరిదో కనుక్కోమన్నాడు కవి.ఫ ఫ ఫ‘నీకు హిమాంశు తెల్సనుకుంటా?’ అడిగాడు కవి. తెలీదన్నాడు సువర్ణ. హిమాంశు కోసం టీమ్‌ని రంగంలోకి దింపాడు కవి. మొబైల్ ఫోన్ చాట్ రికార్డ్స్ శ్రద్ధగా పరిశీలించసాగాడు.
‘సోషల్ మీడియా మోజులోపడి మనుషులు తమ గొప్పలు, తిప్పలు అన్నీ బయట పెట్టేసుకుంటున్నారు సరే, చేేస నేరాలు కూడా చాటింగ్ చేసేస్తారా సువర్ణా?’‘అదే సర్, మొదట్నుంచీ నేను మొత్తుకుంటున్నది. ఆ స్థలం గురించే ఇదంతా!’‘నువ్వేమైనా అను, నాకు చాట్ భండార్ దొరికింది సువర్ణా’ఫ ఫ ఫసాయంకాలపు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ కారు నడుపుకుంటూ ఆశా గైక్వాడ్ ఇంటి కొచ్చేసరికి పోలీసులున్నారు. పదినిమిషాల్లో ఆమె ఇన్‌స్పెక్టర్ కవి ముందుంది, ‘ఏవమ్మా, కాస్తయినా మీ ఆయన గురించి బాధ లేకుండా బాగానే షికార్లు తిరుగుతున్నావే?’‘ఎవరు చెప్పారు మీకు?’‘మీ ఆయన బంధువు సువర్ణ చెప్పాడ్లే. ఎక్కడో మీ ఆయన వున్నాడు కదూ? మమ్మల్ని ఫూల్స్ చేసి ఆనందించడానికే కన్పించడం లేదని కంప్లెయింట్ ఇచ్చావ్, అవునా?’‘ఏంటి మీరనేదీ...’లేకపోతే మీ ఆయన చివరి కాల్ నీతోనే మాట్లాడినప్పుడు, అదే రోజు ఆయన కన్పించడం లేదని నువ్వు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు, ఆ కాల్ సంగతి నువ్వు చెప్పాలిగా?’