Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
కొత్త కథలు
అద్భుత గోళం (నూరుకట్ల పిశాచం కథలు)
అద్భుత గోళం (నూరుకట్ల పిశాచం కథలు)
వసుంధర
అద్భుత గోళంరచనః వసుంధరఒక ఊళ్లో జయదేవుడు అనే యువకుడుడేవాడు. అతడికి ఆటపాటలమీదే తప్ప చదువుమీద దృష్టి ఉండేది కాదు. ఏంచేసినా తనకు తోచినట్లు చెయ్యడమే తప్ప, తప్పొప్పులు ఆలోచించేవాడు కాదు. అది తగదని ఇంట్లో తల్లిదండ్రులు కొడుకుని రోజూ మందలించేవారు. అందుకు జయదేవుడు నొచ్చుకునేవాడు కాదు. కానీ, ప్రతిదానికీ తనని తన ఈడువాడే అయిన వితరణుడితో పోల్చడం అతడికి నచ్చేది కాదు.వితరణుడు శ్రద్ధ్ధగా చదువుతాడు. ఆశువుగా కవిత్వం చెపుతాడు. అందంగా బొమ్మలు గీస్తాడు. శ్రావ్యంగా పాటలు పాడతాడు. ఇవన్నీ చేస్తూనే తలిదండ్రులకు అన్ని పనుల్లోనూ సహాయపడతాడు.రోజు సాయంత్రాలు, ఓ రెండు గంటల సేపు వితరణుడు తన ఈడువారితో ఆటలాడేవాడు. ఆ ఆటల్లోనూ అతడిదే పైచేయిగా వుండేది.'వితరణుడికి తెలిసిన విద్యల్లో ఒక్కటంటే ఒక్క దానిలోనైనా నువ్వతణ్ణి మించగలవా?' అని తల్లిదండ్రులు జయదేవుడిని చిన్నబుచ్చేవారు.జయదేవుడికి ఎలాగూ ఏ విద్యపట్లా ఆసక్తి లేదు. ఆటల్లోనైనా వితరణుడిని ఓడించి తలిదండ్రుల్ని మెప్పించాలని అనుకున్నాడు. కానీ, ఎంత కృషి చేసినా అతడు ఏ ఆటలోనూ వితరణుడిని మించలేక పోయాడు. ఇది అతడికి ఎంతో బాధగా ఉన్నది.'వితరణుడు నీతిమంతుడు. అతడి బలం నీతిలో ఉన్నది. అతడు అన్నింటా తలిదండ్రులకు సాయం చేస్తాడు. అందువల్ల అతడికి వారి దీవెనలు బలంగా ఉంటాయి. నీవూ అలా ఉండు, అతడిని మించిపోతావు' అని తల్లి జయదేవుడితో అనేది. కొన్నాళ్లకు ఈ మాట జయదేవుడి బుర్రకెక్కింది. ఒకరోజు తండ్రి కొబ్బరి మొక్కలు పాతడానికి పెరట్లో గోతులు తవ్వుతుంటే, ఆయన్ని తప్పుకోమని, తానే గోతులు తవ్వసాగాడు జయదేవుడు.చివరి గొయ్యి తవ్వుతుండగా జయదేవుడికి ఒక పంచరంగుల గోళం దొరికింది. అది ఎంతో అందంగా మెరుస్తున్నది. జయదేవుడది తీసుకుని స్నానాలగదికి వెళ్లాడు. గోళాన్ని కడిగి శుభ్రం చేసి, తనూ స్నానం చేశాడు. ఆ తర్వాత, మంచి బట్టలు వేసుకుని, గోళాన్ని తన రొంటిన దాచుకున్నాడు. విచిత్రంగా ఉన్న ఆ గోళాన్ని తన మిత్రులకు చూపించాలని ఇంట్లోంచి బయల్దేరాడు. అప్పుడతడిలో కొత్త ఉత్సాహం పుట్టింది.
1 to 6
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.