‘‘సెక్స్ అంటే రెండు దేహాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక...’’ అన్నాడు జోసఫ్.‘‘బుల్‌షిట్.. అదంతా నాకు తెలియదు. ఆడదానికి దేవుడు అందం ఇచ్చింది మగాడికి అర్పించడానికే. అందులోనే వాళ్లకి ఆనందం ఉంది’’ అన్నాడు కిరిటీ.‘‘నీ స్టేట్‌మెంట్ చాలా డ్యామేజింగ్‌గా ఉంది గురూ. నీకు ఇప్పుడు ఏం చెప్పినా తలకెక్కదు. విశృంఖలత వ్యాకులతకు దారితీస్తుంది గుర్తుంచుకో’’ హెచ్చరించాడు జోసఫ్.
వారిమధ్య ఈ డిస్కషన్ జరిగి మూడేళ్లవుతోంది. జోసఫ్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా మారి లక్నో వెళ్లిపోయాడు. కిరీటీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగాడు. దూకుడు స్వభావం కావడంతో తొందరగానే కోట్లకు ఎగబాకాడు. ఒకటి రెండు సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు. నిర్మాత శ్యామలరావు లాంటివాళ్ళు కిరీటి బలహీనతను ఎన్‌క్యాష్ చేసుకున్నారు.
ఇప్పుడు అతడికి ఒక సమస్య ఎదురైంది.అతడి జీవితంలోకి కావేరి వచ్చింది. శవంలాగా ఒళ్లు అప్పగించే భార్య కావేరితో అతడి సెక్స్ జీవితం ‘డల్ ’గా మారిపోయింది. కొత్త రుచులకోసం మనసు పీకుతున్నా, ఏ జబ్బులు తన భార్యకి తన ద్వారా సంక్రమిస్తాయో, అవి తన బిడ్డలకు వస్తాయోమో అని తనను తాను నిగ్రహించుకున్నాడు.అతడి మానసికస్థితిని కావేరి గమనిస్తూనే ఉంది.‘‘ఏం కావాలి మీకు?’’ ఒకరోజు అడిగింది అతడి అనీజినెస్ చూసి. ‘‘నిశ్చయంగా నువ్వుమాత్రం కాదు’’ అన్నాడు పెద్దగా ఆలోచించకుండానే.. సీరియస్‌గా అన్నాడో క్యాజువల్‌గా అన్నాడో అర్థం కాలేదు.ఆమె హృదయం తీవ్రంగా గాయపడింది. అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ‘‘మీ మనసుకీ దేహానికీ సింక్ కావడంలేదు శ్రీవారూ..’’ అంది. కిరీటికి అర్థం కాలేదు. ‘‘మనసు కోరేది దేహం కోరేది ఒకటి కాదు..’’ అని చెప్పింది.