‘‘నాకెందుకో నీతో ఉండాలని లేదు రవీ .. విడిపోదాం!’’నేను అనుకున్నట్లే షాక్ తిన్నాడు రవి.కానీ, తమాయించుకుని -‘‘ఎందుకు సకలా? పాతికేళ్ల తరవాత .. ఎందుకు ఈ నిర్ణయం?!’’ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘అందుకే .. పాతికేళ్లుగా .. ఎందుకు కలిసివున్నామో తెలియడం లేదు.. మరింకొక పాతికేళ్లు .. ఆయుర్దాయం ఉంటే .. ఇట్లాగే .. ఎందుకు కలిసి ఉన్నామో తెలియకుండా .. అవసరమా?’’మాట్లాడలేదు రవి.
అతను మితభాషి. మాటలు, డబ్బు .. రెండూ జాగ్రత్తగా వాడతాడు... ఎమోషన్స్ చాలా ఖరీదు కోరుకుంటాయని తెలుసు.చక్కటి ఇల్లు, కారు, నగలు, సంపాదించే భర్త .. దేనికీ ఈ నిర్ణయం? ఏం తక్కువైంది?! అనే చచ్చు ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చే రకం కాను; ఎవరి జీవితాలు ఎలా గడపాలో మరొకరు శాసించే కాలం తీరిపోయింది.మన జీవితంలో ఏం తక్కువ అయింది? అన్న ప్రశ్నలు రవి అడగడు, అడగలేడు ... కారణం?!నేను ఏమంటానో అన్న భయం.. ఏమన్నా అనగలనని తెలుసు అతనికి.‘‘మనకు పిల్లలు లేరనా?!’’ చిన్న గొంతుతో అన్నాడు.
తలెత్తి చూశాను ..‘‘కాదు .. కొన్నాళ్ల క్రితం మనకు పిల్లలు ఉంటే .. ఈ గాప్ ఏదో తెలిసేది కాదేమో అనుకునేదాన్ని .. గాప్ ఫిల్లింగ్‌కు ఎవరూ ఏదీ ఉపయోగించరు అని తెలిసి .. పిల్లలులేకపోవడమే హాయి అనిపిస్తోంది..’’ఆ రాత్రంతా నిద్రపోలేదు రవి..విడిపోవడం అనేది .. ‘నా జీవితం సెటిల్ అయింది’ అని ఫాల్స్ సెక్యూరిటీతో బతికే రవిలాంటివాడికి ఎంత ఇన్‌సెక్యూరిటీ ఇస్తుందో నాకు తెలుసు.ఏదో కచ్చతో .. అతని సెక్యూరిటీ అనుకునే ‘ఇగో’ బద్దలుకొట్టాలని ఈ పని చేస్తున్నానా?! .. కాదు .. ఏదో భరింపరానితనం.. కరుడుకట్టినట్లున్న ఏదో బరువు .. నన్నునొక్కేస్తున్నట్టు .. ఊపిరి ఆడనట్టు ..బలవంతంగా తలకాయను నీటిలోఅడుగున నొక్కిపట్టినట్టు .. అమ్మో! నా వల్లకాదు. ఈ ఫీలింగ్ రోజుకు ఐదారుసార్లు రావడం ప్రారంభించిన తరువాతే.. ఈనిర్ణయానికి వచ్చాను.రాత్రంతా రవి ఫోన్లు .. ‘మొగుడువదిలేశాడు’ అని మా అమ్మమ్మ కాలంలో