‘‘దేశంలో వ్యాపారవేత్తలకు ఆరు లక్షల 40 వేల కోట్ల ఋణాలు ఇవ్వబడ్డాయి. రైతులకిచ్చిన ఋణాలకంటే ఇది ఎక్కువ. బ్యాంకుల్ని మోసం చేయడం సులువైపోయింది. ఎందుకు జరుగు తుంది. ఇలా’’ అడిగాడు అశ్వద్థామ.‘‘ఆశ...మనిషికి ఆశ... డబ్బుమీద వ్యామోహం’’ విశ్లేషించాడు అశ్వద్ధామ. నవ్వాడు ఆదినారాయణ.‘‘ఇంతకీ మన బాపిరాజుపై కేసు నమోదవుతుందా?’’ అడిగాడు అశ్వత్థామ.

‘‘మానిప్యులేషన్‌లో మనవాడు దిట్టగదా... చూద్దాం ఏంజరుగుతోందో’’ చెప్పాడు ఆదినారాయణ.కె.పి.హెచ్‌.బి. పార్కులో రోజూ ‘మార్నింగ్‌ వాక్‌’లో కలుస్తుంటారు. వాకింగ్‌ చేసినంత సేపు రాత్రి టి.విల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషిస్తూ... వాకింగ్‌ కంప్లీట్‌ చేస్తుంటారు.అశ్వద్దామ సీనియర్‌ జర్నలిస్ట్‌... ఆదినారాయణ ఇంటలిజెన్స్‌ విభాగంలో పని చేస్తోన్న పోలీస్‌ ఆఫీసర్‌.బాపిరాజు ఇద్దరికీ కామన్‌ఫ్రెండ్‌. చిన్నప్పటి క్లాస్‌మేట్‌. కానీ. ఇప్పుడు ఇద్దరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. తెలివి తేటల్లో బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌. చూస్తుండగానే ఎదిగిపోయాడు.అతడి గురించి మాట్లాడుకోవద్దని అనుకుంటూనే మాట్లాడుకుంటుంటారు వాళ్ళు.బాపిరాజు ఎదిగే కొద్దీ సంతోషపడాలి కానీ స్నేహితులిద్దరికీ బాధ కలుగుతుంది.

బాపిరాజు అప్పుడప్పుడు ఇద్దరికీ ఫోన్‌చేసి ‘‘ఏంట్రా... ఆ ఏడుపుగొట్టు ముఖాలు... రండి సిట్టింగ్‌ వేద్దాం’’ అని ఎద్దేవా చేస్తూ పిలుస్తుంటాడు.‘‘వీడికి ఎలా తెలుసు మన ఫీలింగ్స్‌... కొంపముంచి వీడికేమైనా ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ తెలుసా.’’ అంటూ ఉంటాడు అశ్వద్దామ నవ్వుతూ... ‘‘మన చుట్టూ సి.సి. కెమెరాలు పెట్టాడేమో చూడు.’’ నవ్వుతూ అంటాడు ఆదినారాయణ. నెలకొకసారి కలుస్తుంటారు వీళ్ళు. కలిసినప్పుడు గ్లాసులు గల... గలమంటాయ్‌.‘‘మీరు ఓకే అంటే గాజులు కూడా గలగలమనిపిస్తా’’ అనేవాడు.‘‘వద్దులే బాబూ మేము పులిరాజులం కాలేము’’ అనేవాడు ఆదినారాయణ నవ్వుతూ.

‘‘నీకేంటి బాస్‌... కావాలంటే కో కొల్లలు.. ఏ.ఎస్‌.ఐ. గాడ్నో పంపితే... కత్తిలాంటి ఫిగర్‌ని పట్టుకొచ్చి... ‘బెడ్‌’ మీద పడేస్తాడు’’ అనేవాడు బాపిరాజు.‍‘‘అరేయ్‌ అది నోరా మున్సిపాలిటీ పంపా’’ ఖండించేవాడు అశ్వద్దామ.‘‘వద్దులే బాబూ మేము పులిరాజాలం కాలేము’’ అనేవాడు ఆదినారాయణ నవ్వుతూ.‘‘నీకేంటి బాస్‌... కావాలంటే కో కొల్లలు. ఏ.ఎస్‌.ఐ. గాడ్నో పంపితే... కత్తిలాంటి ఫిగర్‌ని పట్టుకొచ్చి.... ‘బెడ్‌’ మీద పడేస్తాడు...’’ అనేవాడు బాపిరాజు.‘‘అరేయ్‌ అది నోరా మున్సిపాలిటీ పంపా...’’ ఖండించే వాడు అశ్వద్దామ.