‘‘నువ్వర్జెంటుగా యీ హోటల్‌కి రాగలవా? లాబీలో వున్నాను’’ ఫోనులో అవతలి నుంచి కావేరి. గొంతులో అలసట ఉన్నా ఎప్పటిలాగే కంచుమోగిన మార్దవం.‘‘యే హోటల్‌?’’ అనడిగి ‘‘వస్తున్నా’’ అని, లాప్టాపు మూసేసి లేచాడు బాలు.పావుగంటలో హోటల్‌ చేరుకుని లాబీలోకెళ్లాడు. కాళ్లదగ్గర సూట్కేసుతో మూలగా సోఫాలో కూర్చుని పాంప్లెట్‌ తిరగేస్తోంది కావేరి. వెళ్లి పక్కసోఫాలో కూర్చున్నాడు. చనువుగా నవ్వింది. వంకీల జుట్టు చెదిరి ఊగుతున్న ముంగురులు, కదిలే కనుబొమలు, నవ్వే పెద్దకళ్లు, దిక్సూచి ముక్కు, వంపుతిరిగే పెదవులు. ‘అభినయం కూడా భాగమై కళాకారుల మొహం డైనమిగ్గా ఐపోతుందా’ అనుకున్నాడు.‘‘మొన్నట్నుంచి నా మెసేజ్‌లను చూసుకోకపోయినా ఫోన్‌ చేస్తే నువ్వొస్తావని తెలుసు. ‘ఆఫీసు పనిమీద నువ్వీ విశాపట్నంలో వున్నావని’ పూణే నుంచి మధు చెప్పినాడు’’ అంది అభిమానంగా చూస్తూ.‘‘పని చివరికొచ్చి బిజీగా వున్నాను. యేమిటి సంగతి?’’ అన్నాడు.‘‘నా పెండ్లిచూపులు’’ చిలిపిగా అని ‘‘యీరాత్రికి నాకు బస యేర్పాటు చెయ్యి. యీ హోటల్లో వొద్దు. నీ రూమైనా ఫర్వాలేదు. చుట్టానివి, చిన్నప్పట్నుంచీ ఫ్రెండువి. యెవురూ యేమనుకోరు’’ అంది.‘‘నా రూంలో ఖాళీ లేదు, మరోచోటికి వెళ్దాం’’ అని ‘‘యిక్కడికెప్పుడొచ్చినావు?’’ అడిగాడు.‘‘యీ నగరంలో రాష్ట్రస్థాయి జానపద నృత్యాల పోటీ జరుగుతావుందనే విషయం నీకు తెలుసా? రేపే ఫైనల్స్‌! నువ్వు పుస్తకాల్లోంచి తలెత్తి చూస్తేగదా ప్రపంచం కనబడేదీ? పల్లవి నిన్నెట్లా భరిస్తావుందో!’’ గలగలా నవ్వింది.‘‘నీ మెసేజ్‌ చూసుకోక చాలా మిస్సైనాను. రేపుకూడా రాలేనేమో. నీ డ్యాన్సులో మూఁమెంట్స్‌, అభినయంలో భావోద్వేగాలు బ్లోఅప్‌ ఔతాయి. నాకెవడైనా వుచితంగా నెలజీతమిస్తే వూరూరూ తిరుగుతూ యిట్లాంటి ప్రోగ్రాములు చూస్తూ గడిపేస్తాను’’ అభినందించాడు బాలు.‘‘జడ్జీలు నీ కళ్లతో చూస్తే బావుణ్ణు. ఐనా నేను చేయాల్సిందే శానావుంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అద్భుతమైన వీరగాథలు, స్త్రీల పాటలు వున్నాయి. వాట్ని బ్యాలేలుగా తయారుచెయ్యాల, విదేశాల్లో ఆడాల.’’‘‘జానపదుల పాటల్లోనే ఆ శక్తి వుంది. యింకొంచెం రిఫైన్‌ చేసి ప్రొఫెషనల్‌గా చేస్తే అంతర్జాతీయ స్థాయికి యెదుగుతావు.’’‘‘నీ ప్రోత్సాహం సరే, నిన్నరాత్రేం జరిగిందో విను. నిన్న పొద్దున నేనూ, సతీషు కర్నూలు నుంచి దిగినాము. జంటనృత్యాల్లో వాడు డ్యాన్సింగ్‌ పార్ట ్నర్‌. సాయంత్రానికి సోలో, జంట క్యాటగిరీల్లో రెండురౌండ్లు దాటేసినా. బస విషయంలో నాకు అపద్దం చెప్పి రాత్రి యిక్కడికి తెచ్చినాడు. గంటైనాక వాడూ నారూములోకే వొచ్చి ‘యిద్దరికీ యిదే రూము’ అన్నాడు. పైగా కొంచెం మందు సేవించివున్నాడు. మొహంమీద వొక్కటిచ్చి, వాడిని వాడి సూట్కేసునూ బయటపడేసి తలుపేసుకున్నాను. యీరోజు పోటీల దగ్గర వాడు కనపడలేదు, పారిపొయినాడు యెదవ! రేపు సోలో ఫైనల్స్‌ చూసుకోని రాత్రిరైలుకు వెళ్లిపోతాను. పోయినసారి హైదరాబాదులో, యీసారిక్కడా ఆదుకున్నావు. ద్రౌపదికి క్రిష్ణుడులాగ’’ అంది నవ్వుతూ.

 

 

 

రాంక్రిష్ణ బాలుని పలకరించి ఇంట్లోకి వెళ్లాడు.ఫ ఫ ఫబాలు హైద్రాబాదు వచ్చాక మధుకి ఫోన్‌ చేసి కావేరి పరిస్థితి చెప్పాడు. ‘‘నీకు తెలియందేముంది బాలూ’’ అని ఊరుకున్నాడు మధు.రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి హఠాత్తుగా కావేరి ఫోన్‌ చేసింది.‘‘నీకు మాబావ రాంక్రిష్ణ తెలుసుగా?’’ అడిగింది నిర్లిప్తంగా.‘‘తెలుసు, యేం?’’ అన్నాడు బాలు.‘‘రేపునెల్లో అతన్తో నాపెండ్లి, నువ్వు తప్పక రావాల’’ అంది ఎండిన గొంతుతో.చేదువార్త విన్నట్లై అలాగే ఉండిపోయాడు బాలు.‘‘మా చుట్టాలంతా ఖుషీ. అమ్మానాన్నా మాత్రం మొదట యేడ్చినారు’’ అంది తనే మళ్లీ.‘‘నువ్వొప్పుకునే చేసుకుంటున్నావా?’’ ఆతృతగా అడిగాడు.‘‘నేనే కష్టపడి అతన్ని వొప్పించినా’’ అని ఫోన్‌ పెట్టేసింది కావేరి.‘‘బాలూ నాకో మంచి పెండ్లికొడుకును చూడవా, యెవురైనా ఫర్వాలేదు. నీమాదిరి అర్థం చేసుకునే వాడై వుండాల. మా అమ్మ తెచ్చే చాదస్తులు నామొహంజూసి పెండ్లిజేసుకున్నా రోజూ అనుమానించేదానికి యిప్పుటికి నాకున్నచెడ్డపేరే చాలు. రేపు తోడెక్కడొస్తారు?’’

                                                                                                                                                                                                     - 93987 38032

                                                                   ********************************