న్యూఢిల్లీ! డిసెంబర్ ప్రారంభంలోనే ఎడతెగని చలిపెడుతున్నది.హాస్పిటల్లో డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి శ్రీమతి ఇచ్చిన గరంచాయ్ తాగుతూ టీవీలో న్యూస్‌చూస్తూ రిలాక్స్ అవుతున్నాను. ఇంతలోనే నా బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్ రింగైంది.రాజశేఖరం మామయ్య లైన్లో ఉన్నాడు. అమ్మా నాన్నా తరువాత నాకు అత్యంత ఆప్తుడు మామయ్యే. ఫోన్లో ఆయన చెప్పిన విషయాలు నాకు ఆందోళన కలిగించాయి.
మామయ్య ఆరోగ్యం ఏమీ బాగాలేదట. తరచూ కడుపునొప్పి వస్తోందట. అప్పుడప్పుడూ వాంతులు అవుతున్నాయట. ఏం జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నాడు.ఆరోగ్యం గురించి ఆయన అంతశ్రద్ధ చూపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు తెలిసినంతవరకూ ఆయన కేర్‌నాట్, ఫ్రీబర్డ్ వగైరా కోవలోకి వచ్చే విలాస పురుషుడు. జీవితమంతా ఆనందమకరందం గ్రోలే తేనెటీగ లాగా సుఖభోగాలు అనుభవించినవాడు. నాకు తెలిసి ఆయనకు చావంటే భయంలేదు, బ్రతుకంటే తీపిలేదు. పైగా ఆజన్మబ్రహ్మచారి! ఆయనమీద ఆధారపడినవాళ్లెవరూ లేరు. అటువంటి హీమేన్ తన ఆరోగ్యంగురించి ఆందోళనపడటం నాకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది.మామయ్య ఉండేది కూడా ఢిల్లీలోనే. అయినా, నేను ఆయనను చూసి చాలాకాలమైపోయింది. ఆయనను ఒకసారి చూసిరావాలని చాలాసార్లు అనుకున్నాను.
అత్యవసరమైన పనులవల్ల ఎప్పటికప్పుడు ఆ ప్రోగ్రాం వాయిదాపడుతోంది.‘‘మామయ్యా! నువ్వేమీ దిగులుపడకు, ఈ శనివారం మధ్యాహ్నాంనుంచీ నాకు డ్యూటీ లేదు. శనివారం మధ్యాహ్నం ఆర్.కె.నగర్లో మీ ఇంటికి వస్తాను. నిన్నుచూసి అవసరమైతే ఏమైనా టెస్టులు చేయిద్దాం’’ అన్నాను.‘‘సరే రా, నీ కోసం వెయిట్ చేస్తాను ఆ రోజు’’ అని కాల్ కట్ చేశాడు మామయ్య.మామయ్యను నేను మొదటిసారి చూసిననాటి సంఘటనలవైపు మళ్లాయి నా ఆలోచనలు. కుర్చీలో వెనక్కువాలి కళ్ళు మూసుకొని , ఆనాటి సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాను.త