‘‘విడిపోయేదానికి కలవడం ఎందుకు...?’’ ప్రశ్నించింది తులసి.‘‘ఊపిరి ఆడనప్పుడు కిటికీలు బద్దలు చేసుకునైనా బయటకు రావడానికి ప్రయత్నిస్తాంకదా, ఇదీ అంతే..’’ చెప్పింది సరయు.‘‘బయటకు వచ్చాక ప్రవాహం నిన్ను ముంచేస్తే...’’ సరయు కళ్ళలోకి చూస్తూ అడిగింది తులసి. సమాధానం చెప్పలేదు సరయు. అలాగే, తులసి కళ్ళలోకి చూస్తూ కూర్చుంది.
‘‘లోపలే ఉండడం బెటర్ కదూ..’’ అని అర్దోక్తిగా ఆగింది. కాసేపటి తర్వాత,‘‘ఎక్కడున్నా పోవడం ఖాయమంటావ్’’ అంది.‘‘కాదు... లోపలే ఉండి... పరిష్కారాలు వెతుక్కోవడం బెటర్...’’ అంది తులసి.‘‘విడిపోవడమేతప్ప, దీనికి పరిష్కారం లేదు’’ అంది సరయు.‘‘అది నిరాశావాదం డియర్...’’ అని సరయు మెడచుట్టూ చేతులు వేసింది తులసి.రెండురోజులుగా తులసి ఇంట్లో ఉంటోంది సరయు.‘‘రాఘవ్‌కి ఫోన్ చెయ్...’’ అంది తులసి.‘‘నెవర్’’‘‘ఇగో..నీ సమస్యల్ని పరిష్కరించదు’’ కాస్త కోపంగా అంది తులసి.‘‘కాదు, ఇది సెల్ప్ రెస్సెక్ట్’’ అంది సరయు.‘‘దానికి ఒక్కొక్కరు ఒక్కోపేరు పెడుతుంటారు...’’ అంది తులసి. ‘‘నువ్విలా భీష్మించుకోవడం బావోలేదురా’’ అన్నాడు భాను.‘‘అలా ఎందుకు అనుకుంటావ్. విముక్తి అనుకోవచ్చుగా...’’ అన్నాడు రాఘవ.
‘‘ఎవరినుంచి ఎవరికీ...’’ అడిగాడు భాను.‘‘పరస్పరం...’’‘‘తర్వాత...’’ అడిగాడు భాను. ‘‘కొత్తజీవితం కొత్త చివుళ్లు..’’‘‘అప్పుడు మాత్రం ‘ఇగో’ క్లాషస్ రావా?...’’‘‘మళ్ళీ కొత్త జీవితం.. కొత్త చిగుళ్ళు...’’ నవ్వాడు రాఘవ.‘‘ఆపు.. నీ వెర్రితనం...’’ కాస్త కోపంగానే అన్నాడు భాను.‘‘ప్రస్తుతానికి ఇంతే ఇక నువ్వు దయచెయ్, నీకు ఆఫీస్ ఉందిగా..’’ అన్నాడు డోర్ వైపు చెయ్యి చూపిస్తూ. బయటకు భాను కదలబోతుంటే, ‘‘వన్ మినిట్...’’ అన్నాడు.‘ఏంటి...’ అన్నట్టు చూశాడు భాను.‘‘కాఫీ కూడా ఇవ్వలేదంటావ్ నన్ను, కాసేపు ఆగు...’’ అని కుర్చీలోంచి లేచివెళ్లి కాఫీ కలుపుకుని కప్పుల్లో తెచ్చాడు. భాను నవ్వుతూ ‘కాఫీ’ తీసుకుని,‘‘ఇదేరా నీ పొగరు... సరయు లేకపోయినా జీవితాన్ని లాగించేయొచ్చు అన్నదే నీ ధీమా’’ అన్నాడు.