ఇంట్లో కూతుర్ని వదిలేసి.. అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారా తల్లిదండ్రులు.. మనవడు పుట్టాడని తెలిసి అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. మూడు నెలల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటం చూశారు. పక్కింటామె వచ్చి.. తాళంతోపాటు ఓ కవర్‌ను కూడా ఇచ్చింది. ఆ కవర్‌లో కూతురు రాసిన ఓ ఉత్తరం ఉంది.. ఆ లేఖను చదివిన ఆ తల్లిదండ్రులకు...
*******************
డోర్‌బెల్ మోగింది.‘పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసిపోవచ్చుగా? మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం? ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్రవెధవ వినడు. ఇంకా పూర్తిగా చీకట్లుపోనేలేదు. తెలతెలవారుతుండగా అప్పుడే మంచినిద్ర పడుతోంది. అసలే చలికాలం. అందులోనూ దుప్పటి కప్పుకుని పడుకుంటే అస్సలు లేవాలనిపించదు’. విసుక్కుంటూ లేచి తలుపుతీసింది సావిత్రి.ఎదురుగా కనపడిన మొహంచూసి బిత్తరపోతూ ‘‘నువ్వా?...మీరా! ఏమిటిలా హఠాత్తుగా. ఫోనైనా చెయ్యవచ్చుగదా’’ అల్లుడిని చూసి నైట్‌గౌను సర్దుకుంటూ గాభరగా అంది.‘‘చెప్పివచ్చినాగానీ, ఇక్కడెవరు మాకు హారతులిచ్చి స్వాగతించరని తెలుసుగా’’ వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు. గుమ్మంలోంచి తప్పుకుని, ‘‘రండి లోపలికి’’ అంది సావిత్రి. షోల్డర్‌బ్యాగ్‌తో లోపలికివచ్చి, కూతురుగదివైపు వెళ్ళబోతూంటే, ‘‘కాసేపు ఈ గదిలోకివెళ్ళి పడుకోండి. ఇంకా పూర్తిగా తెల్లారలేదుగా, అమ్మాయి మంచినిద్రలో ఉంది. మళ్ళీ పిల్లాడు నిద్రలేచిపోతాడు’’ అంటూ మూడోగదివైపు చెయ్యి చూపించింది సావిత్రి.‘‘అవునులెండి. ఆవిడగారికి ఇప్పుడప్పుడే తెల్లారదుగా’’ అన్నాడు అల్లుడు, మళ్ళీ ఓ వ్యంగపు నవ్వు నవ్వి. లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు.
సావిత్రి తన గదిలోకివెళ్ళి పక్కమీద వాలిందేగానీ, ఇంక నిద్రేంపడుతుంది. ‘తెల్లారి ఎదుర్కోబోయే సంఘటనలు...అటు అల్లుడు, ఇటు కూతురు. ఇద్దరికిద్దరే. ఒకరి మాట మరొకరు వినరు. తమదే రైటు అంటారుతప్ప ఎదుటమనిషిని అర్థంచేసుకునే ప్రసక్తేలేదు. మధ్యలో తనకే చచ్చేచావొచ్చింది. ఆయన కల్పించుకోరు. పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఏడాదికాలంగా చెప్పీ, చెప్పీ...‘‘నాకింకేం చెప్పొద్దు. వాళ్లేడుపు వాళ్ళని ఏడవనీ... నా ప్రాణం విసిగిపోయింది. ఇది వెళ్లదు, అతను వదలడు’’ అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త’.‘‘ఏమిటి అప్పుడే లేచావు. పడుకో పడుకో’’ కళ్ళప్పి బద్ధకంగా అన్నాడు మూర్తి.‘‘ఏం పడుకుంటాను. అవతల అల్లుడుగారు వేంచేశారు’’ విరక్తిగా అంది సావిత్రి.