ఆ ఇంట్లో భార్యాభర్త ఇద్దరే ఉంటారు. చిరు జీతగాడైన ఆ భర్త తెగకష్టపడుతూ ఉంటాడు. భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో టీవీ కూడా లేదు. పక్కడాబా మీదనుంచి ఆ కుర్రాడు చాలాకాలంగా ఆమెను గమనిస్తున్నాడు. అతడు బస్కీలు తీస్తుంటే ఆమె కిటికీలోంచి చూసేది. మెల్లిమెల్లిగా వాళ్ళమధ్య మాటలు కలిశాయి. కిర్రెక్కించే బొమ్మలున్న పుస్తకాలిచ్చేవాడు. ఆమె శ్రద్ధగా చదివేది. ఏదోలా అనిపించేది. ఒకరోజు ఆమె భర్త క్యాంప్‌కి వెళ్ళాడు. అప్పుడు....

*****************

వరలక్ష్మి అందగత్తే. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. భర్త రాజారాం పెళ్ళినాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరరీ పోస్టు. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్ళందరూ పల్లెటూర్లో, అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతని కష్టాన్ని గుర్తించి మేనేజంట్‌వాళ్ళు అతన్ని ఉద్యోగంలో పర్మనెంటు చేశారు. ఇంటి గురించి, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేశాడు. జీతానికి జీతమే కాకుండా ఓవర్‌టైమ్‌ చేసినందుకు కూడా పేమెంట్‌ అందేది. తన ఇంటిఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలింది తన కుటుంబానికి పంపేవాడు.డాబామీద చిన్నగది. దాన్ని ఆనుకుని వంటిల్లు. ఆ తరువాత దూరంగా బాత్రూం, టాయిలెట్‌.

బాత్రూంలో స్నానంచేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్‌ డాబా. వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉంది. స్నానంచేసి పొడిచీర ఒంటికి చుట్టబెట్టకు పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోడానికి అవకాశం లేదు. చుట్టూ డాబా ఇళ్లు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగకళ్ళు సగంకప్పిన ఆమె ఒంటిమీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతోంది. ఒంటిమీద నీటి బిందువులు ఆ వేడి వాడి చూపులకి కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు.భర్త ఉదయం ఆరుగంటలకి డ్యూటీకీ వెళితే మళ్ళీ అర్థరాత్రికిగానీ ఇంటికి తిరిగిరాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవటమే. పట్నవాసం ఆమెకి కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లిందిలేదు. ఆదివారం భర్తకి సెలవు. అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్‌కి తీసుకెళతాడు. సినిమాలకి షాపింగ్‌లకి వాళ్ల బడ్జెట్‌ సరిపోదు. బీచ్‌లో కూర్చుని పల్లీలుతింటూ కబుర్లుచెప్పుకుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబవిషయాలు, ఆఫీసు విషయాలు మాట్లాడతాడు. ఆమె దేనికీ అవుననిగానీ, కాదనిగానీ చెప్పదు.