‘‘ఎక్స్‌క్యూజ్‌మి సార్, మే ఐ కమిన్?’’ వినయంగా మెత్తని స్వరం వినిపించింది.తలెత్తి చూసి, ‘యెస్’ అంటూ లోపలికి రమ్మని తలూపాను.డోర్ మెల్లగా వేసి, నా టేబుల్‌కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న అతనిని పరిశీలనగా చూడసాగాను.వయసు సుమారుగా ముప్పై ఐదు వరకూ ఉండవచ్చు. చూడగానే సదాభిప్రాయం కలిగే చక్కని రూపం. బ్లూ జీన్స్‌పై, పాల మీగడ లాంటి వైట్ షర్ట్ నీటుగా టక్ చేసి, హుందాగా ఉన్నాడు.
విశాలమైన గదిలోని ఏ.సి. గాలి ఆ మూలనున్న శాండిల్ ఫ్లవర్స్‌ను సున్నితంగా అల్లుకొని గదంతా పరిమళం వెదజల్లుతోంది.గదిలో అందంగా అమరిన సైకాలజీలో నాకొచ్చిన అవార్డులు, గోల్డ్ మెడల్స్‌నుతదేకంగా చూస్తున్న అతన్ని గమనించసాగాను.ఒక నిమిషం తర్వాత ‘‘సారీ డాక్టర్! మీకొచ్చిన అవార్డ్స్ చూస్తూ మైమరిచి పోయాను. వాట్ ఏ గ్రేట్ పర్సన్ యూ ఆర్. ఇవన్నీ చూస్తుంటే నాక్కొంచెం ఈర్ష్య కూడా కలుగుతోంది’’ గొంతులో నిజాయితీధ్వనించింది.చిన్నగా నవ్వి, చెప్పండి అన్నట్లు చూశాను.‘‘నా పేరు హేమంత్. నేనొక ప్రభుత్వ ఉన్నతోద్యోగిని’’ చిరునవ్వుతో చెప్పాడు.‘‘ఇలా మీ వద్దకు వచ్చే అవసరం పడుతుందని నేను ఏ రోజూ అనుకోలేదు’’ పేంటు జేబులోంచి రుమాలు తీసి ఒకసారి నుదురును సుతిమెత్తగా ఒత్తుకున్నాడు.
ఆసక్తిగా వింటున్న నన్ను చూసి -‘‘నేను వృత్తి రీత్యా రకరకాల వ్యక్తులను కలుస్తుంటాను. ఒకసారి మాట్లాడితే చాలు, ఫలితాలను నాకు అనుకూలంగా రాబట్టు కుంటాను’’ ఆ మాట చెప్తున్నప్పుడు అతని ఛాతీ కొద్దిగా పొంగడం చూసి నవ్వుకుంటూ అన్నాను .. ‘‘వెరీ నైస్, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. మీరు కార్య సాధకులని.’’‘‘థాంక్ యు డాక్టర్. నా ఆలోచనలను, వాటిలో వస్తున్న మార్పుల గురించి మీతో మాట్లాడాలని వచ్చాను.’’ప్రొసీడ్ అన్నట్లున్న నా చూపులను చూసి కొనసాగించాడు అతను.‘‘నా దగ్గరకు వచ్చే కాంట్రాక్టర్లతో గాని, మా హయ్యర్ ఆఫీషియల్‌తో గాని, మా కొలీగ్స్‌తో గాని మాట్లాడుతున్నప్పుడు చక్కగానే మాట్లాడుతుంటాను. నవ్వుల మధ్యనే ఎటువంటి క్లిష్టమయిన సమస్యనయినా చాలా సులభంగా క్లోజ్ చేస్తాను.’’‘‘వెరీ నైస్.’’