ఇవి అందరి కథలు
మనిషి ఎక్కడ ఉన్నా.. తన కన్నీరు ఒక్కటే. యుద్ధం ఎక్కడ జరిగినా... విధ్వంసం ఒక్కటే. అందుకేనేమో అనువాదం కోసం యుద్ధం, పేదరికం లాంటి ఇతి వృత్తాలనే ఎంచుకున్నారు రచయిత. కెనడాలో ఓ చిన్న దుకాణం నడిపే ముదుసలి బతుకుకష్టం, 150 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన అంతర్యుద్ధంలో ఓ బానిస కథ... ఇలా 14 కథల ద్వారా కథాజగత్తును పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పొరుగునే ఉన్న నేపాల్ నుంచి ఆవల ఉన్న ఆస్ట్రేలియా వరకు దేశదేశాల బతుకు వెతలను పరిచారు. వానదొంగ (పోర్చుగల్), గాంధీ అభిమాని (ఫ్రెంచ్)... ఇలా భిన్నదేశాల కథలు... ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.
ఏడు గంటల వార్తలు (మరికొన్ని విదేశీ కథలు)
అనువాదం: కొల్లూరి సోమ శంకర్,
పేజీలు: 114, వెల: రూ. 120
ప్రతులకు: 99484 64365, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు