వన్నెతగ్గని చారిత్రక అక్షర మహల్‌

‘మొగలాయి దర్బార్‌’ను 1921లో ధీరేంద్రనాథ్‌ పాల్‌ బెంగాలీ భాషలో రాశారు. దీనిని 1925లో మొసలికంటి సంజీవరావు తెలుగులోకి ధారావాహికగా అనువదించారు. అప్పట్లో అదో సంచలనం. సుమారు 1400 పేజీల ఈ నవలను నేతి సూర్యనారాయణ శర్మ క్లుప్తీకరించి, నేటి వ్యవహారిక భాషలో, ఎక్కడా ఉత్కంఠ తగ్గకుండా అందించారు. చరిత్రకు కాల్పనికత జోడైన ప్రతి సంఘటన, సన్నివేశం చిత్తరువులా మన ముందు కదలాడుతుంది. మొదట్లో వేసిన చిక్కుముళ్లు ముగింపులో గానీ విడిపోవు. జహంగిర్‌ చివరి రోజుల్లో మొదలై షాజహాను పట్టాభిషిక్తుడు అయ్యే వరకు ఈ నవల సాగుతుంది. రసపుత్ర వీరుల ధైర్యసాహసాలూ జులేఖా, గంగ వంటి పాత్రల లక్ష్యసాధన గొప్పగా, ఆదర్శంగా అనిపిస్తాయి.

- ఎ. రవీంద్రబాబు

మొగలాయి దర్బార్‌ (నవల),

రచన: నేతి సూర్యనారాయణ శర్మ

పేజీలు: 304, వెల: రూ. 275

ప్రతులకు: 040-27612928/27612938,

ప్రముఖ పుస్తక కేంద్రాలు