విలక్షణ జానపద శైలి

మానవీయ కోణంలో సాగిన ‘ముగ్గురాళ్ల మిట్ట’ కథల్లో జానపద శైలిని ప్రదర్శిచారు రచయిత. కారణాంతరాలతో పరీక్షలకు వెళ్లలేని ప్రమీలతో ఎలాగైనా పరీక్షరాయించాలనే పల్లె ఐకమత్యాన్ని చాటిన కథ ‘ముగ్గురాళ్ల మిట్ట’. బయటి ప్రపంచం తెలిసేలా ఆడపిల్లలను పెంచమని సందేశమిస్తుంది ‘గంపకింద కోళ్లు’. గ్రామీణ బడి పిల్లల్ని వెంటాడే పేదరికానికి అద్దం పట్టింది ‘బడి బియ్యం’. పెంపుడు కుక్కతో బంధాన్ని ‘బామ్మ బొచ్చుకుక్క’లో చూడొచ్చు.

- జి.వి.ఎస్‌.మూర్తి

ముగ్గురాళ్ల మిట్ట (కథలు),

రచన: ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు

పేజీలు: 112, వెల: రూ. 100,

ప్రతులకు: 93936 62821