అతను పడిలేచిన కెరటం!
రచయిత సలీం కలం నుంచి ఒలికిన రచన ‘పడిలేచే కెరటం’. అవిటితనం కనబడే శరీరానిది కాదు. కవ్వించి నవ్వుకునే మనుషులది, వాళ్ళ మనసులది అన్న విషయాన్ని హృద్యంగా అక్షరీకరించారు. సాగర్ అనే వికలాంగుడి అంతర్గత వేదన - బహిర్గత భావన - సామాజిక శోధన ఇందులో ప్రతి ధ్వనిస్తాయి. ఎదగాలన్న కసి - ఎగసిపడే కృషి కథానాయకుడు సాగర్‌లో ప్రతిబింబిస్తూ సమాజ పోకడలోని లోపాల్ని ఎత్తిచూపుతాయి.
- వల్లూరి రాఘవరావు
పడిలేచే కెరటం (నవల),
రచన: సలీం
పేజీలు: 368, వెల: రూ. 200,
ప్రతులకు: 7588 630243