సజీవ కవిత్వం

ఎదలోతుల్లోని స్మృతుల్ని మనసు అద్దం మీద ప్రతిబింబింపజేస్తుందీ కవితా సంపుటి. గత పాతికేళ్లుగా కాలిక స్పృహతో కవిత్వమై సాగుతున్న కోడూరి అక్షరం ఇందులో భిన్నంగా కనిపిస్తుంది. హృదయంతో చదివి ఆవాహన చేసుకోవాల్సిన కవిత్వం ఇది. ఈయన కవిత్వం కోట్‌ చేయడానికి లొంగనిది. అయితే సాంతం చదివాక ‘రేగుపండ్ల రుచి’ మాత్రం మనసుకెక్కుతుంది. ‘అతడి కల’, ‘బతుకమ్మా’, ‘అనేక నేనులు’, ‘కవులు మరణించినపుడు’, ‘ఇంతకీ వాళ్లెవరంటావు?’ లాంటి కవితల్లో తొంగిచూసిన శిల్పం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ సంపుటిలో వచనం పాలు ఎక్కువే అయినా ఎంచుకున్న వస్తువు, సారాంశం దాన్ని పసిగట్టదు.

- డా. వెల్దండి శ్రీధర్‌

రేగుపండ్ల చెట్టు (కవిత్వం),

రచన: కోడూరి విజయకుమార్‌

పేజీలు: 88, వెల: రూ. 60

ప్రతులకు: అనల్ప బుక్‌ కంపెనీ, సికింద్రాబాద్‌, 7093800678.