ఇదో జీవన నిర్వచనం

నూట ఎనిమిది కథల ఈ సంపుటం ఓ జీవన నిర్వచనం. యదార్థపూరిత జీవితాన్ని మానవీయత పరిమళించే శిల్పవిన్యాసంతో ఎంతో చక్కగా అందించారు. మానవ సంబంధాలు, ఆర్థిక భవబంధాలు, ఒకటా రెండా? జీవితంలోకి తొంగి చూసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో మనని పలకరించిన సంఘటనలే అన్పిస్తాయి. ‘తప్పెవరిది’, ‘దేవుడు చూపిన దారి’, ‘అందమైన ప్రేమంటే’, ‘వలస బతుకులు’ లాంటి ఆణిముత్యాల్లాటి కథలకు కొదవలేదు.

- వల్లూరి రాఘవరావు

స్పందించే హృదయం (కథలు),

రచన: నామని సుజనాదేవి

పేజీలు: 532, వెల: రూ. 400,

ప్రతులకు: 77993 05575