ఆధిక్యాల ధిక్కరింపు ‘మేరువు’

చిన్నప్పటి నుంచే కమ్యూనిజంపై వల్లమాలిన ప్రేమ. 17 ఏళ్లకే పెళ్లి. భర్తతో కలిసి అజ్ఞాతంలోకి, ఎన్‌కౌంటర్‌లో భర్త మరణం. జనజీవన స్రవంతిలో కలిసినా... ప్రజాసంఘాలతోనే జీవనం. కుటుంబం, సంస్కృతి సంప్రదాయాలతో పోరాటం. మలిదశలోనూ రైతుకూలీ సంఘాలతో కలిసి పోరాటాలు. చివరిదశలో అభిమానాన్ని పంచే నలుగురి మధ్య, ఆ జ్ఞాపకాల కలబోతలు. వెరసి సమాజంలో ‘నేనో మనిషినని, నాకో చైతన్యముందనీ, నా మానసిక, భౌతిక జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నాకుందని కూడా, నేను అనుకోరాదని రాతి శాసనాలు చెక్కేశార’ని గుర్తించి, వాటిని ఢీ కొట్టిన సావిత్రమ్మ జీవితమే ‘‘మేరువు’’. మానవజాతికి వర్గరహిత సమాజమే పరిష్కారమని, అది తెలుసుకునే రోజు తప్పక వస్తుందని నమ్మిన సావిత్రమ్మ జీవితంలోని సంక్లిష్ట సంక్షోభాల సుడిగుండాలే ఈ నవల. 

-  ఎ. రవీంద్రబాబు

 

మేరువు (నవల), రచన: నల్లూరి రుక్మిణి

పేజీలు: 159, వెల: రూ. 90, 

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు