నాలుగో ఎకరం

మిథునంలో అలుపెరుగని అనుబంధానికి పట్టం కట్టిన శ్రీరమణ... నాలుగో ఎకరంలో, నేల తల్లితో మారుతున్న బంధాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సేద్య సంప్రదాయానికి ప్రతినిధి అయిన రైతు, ఆచారాలకు బద్ధుడైన పూజారి ద్వారా ఈ కథకు అంకురార్పణ చేస్తారు. వారి పిల్లల ద్వారా, తరం మారుతున్న కొద్దీ సమాజంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపిస్తారు. కార్పొరేట్‌ కళాశాలల విస్తరణ, రియల్‌ ఎస్టేట్‌ వ్యూహాలు.. చుట్టూ కనిపించే పరిస్థితులే. కానీ వాటిని చెప్పినతీరు ఆకట్టుకుంటుంది. 

 

నాలుగో ఎకరం, రచన: శ్రీరమణ 

పేజీలు: 74, వెల: రూ.100

 ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలు