మనసు నదిలో ‘కాగితం పడవలు’

బాల్యపు జ్ఞాపకాల చుట్టూ, ప్రేమ చుట్టూ అల్లుకున్న మ్యూజింగ్స్‌లాంటి కథలివి. కొత్త డిక్షన్‌తో రాసిన ఈ కథలు మనల్ని ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్రతి కథ ఒక గమ్మత్తైన శిల్పంతో సాగిపోయి ఆశ్చర్యంలో ముంచేస్తుంది. మొత్తం ఇరవై కథల్నీ పూర్తి చేశాక రచయిత వాడిన కవితాత్మక వచనం... అందులోని సాంద్రత, సంక్షిప్తత ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న విషయాలనే కథలుగా మల్చడం వల్ల చాలా తేలిగ్గా రాసినట్టు అనిపిస్తుంది. కానీ అందులోని లోతు అర్థం కాగానే, ఇలా రాయడం కష్టమని తెలుస్తుంది. కథల నిండా జీవితం, ప్రేమ రెండు పాయలు కలిసిపోయిన ఒక వింత అనుభూతికి లోనవుతాం. కథల పట్ల మక్కువ ఉన్నవారే కాదు, కొత్త కథకులు కూడా చదవాల్సినకథలు. 

- డా. వెల్దండి శ్రీధర్‌ 

 

కాగితం పడవలు (ప్రేమలు - కథలు), 

రచన: వి. మల్లికార్జున్‌ 

పేజీలు: 108, వెల: రూ. 150, 

ప్రతులకు: 9381110979