తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కమిషనర్‌ కళాశాల విద్య, రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ సంయుక్త నిర్వహణలో వచన కవితా పితామహుడు కుందుర్తిపై రెండు రోజుల జాతీయ సదస్సు డిసెంబరు 16, 17 తేదీల్లో ఎస్‌.ఆర్‌ అండ్‌ బి.జి. ఎన్‌.ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (ఎ), ఖమ్మంలో జరుగుతుంది. ప్రారంభ సమావేశం డిసెంబరు 16 ఉ.10గం.లకు జరుగుతుంది. రెండు రోజుల సదస్సులో- మొహ మ్మద్‌ జాకిరుల్లా, తాటికొండ రమేష్‌, నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీ శంకర్‌, బన్న అయిలయ్య, పతంగి వెంకటేశ్వర్లు, శీలా వీర్రాజు, సూర్యా ధనుంజయ్‌, ఎన్‌. కిషోర్‌రెడ్డి, యాకూబ్‌, జక్కంపూడి నాగేశ్వరరావు, జి. బాల శ్రీనివాసమూర్తి, నాళేశ్వరం శంకరం, వి.శంకరయ్య, ఎన్‌. వేణు గోపాల్‌, బెల్లి యాదయ్య, కె. సురేష్‌ కుమార్‌, విస్తాలి శంకర్‌రావు, ఎస్‌. రఘు, కె. లావణ్య, కొలకలూరి మధు జ్యోతి, వెల్దండి శ్రీధర్‌, మామిడాల రమేష్‌, పిల్లలమర్రి రాములు, మానమ మునిరత్నం, జల్దా విశ్వనాథ్‌ కుమార్‌, బూదాటి వెంకటేశ్వర్లు, సి.హెచ్‌. లక్ష్మణ చక్రవర్తి, జరుపుల రమేష్‌, ఎన్‌. రజని, శిలాలోలిత, ఎ.జ్యోతి, జె. నీరజ, వంశీ కృష్ణ, కర్రె సదాశివ, నల్లపనేని విజయ లక్ష్మి, కోయి కోటేశ్వరరావు, ఎం.నారా యణ శర్మ, తన్నీరు సురేష్‌, కె.శ్రీనివాస్‌, ఘంటాచక్రపాణి, అల్లం నారాయణ, మువ్వా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇబ్రహీం నిర్గుణ్‌కు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు ఇస్తారు. ప్రసేన్‌ ‘సిక్స్‌టీ పూర్తి’ పుస్తకావిష్కరణ ఉంటుంది.