కావ్యేషు రమ్యం నాటకం. ఎన్ని సాహితీప్రక్రియలు సృజించినా నాటకరచన చేయకపోతే ఆ రచయితకు పరిపూర్ణత్వం చేకూరదు. అలాంటి పరిపూర్ణత సాధించమేకాదు, పాతిక నాటకాల స్వీయ రచనను ఇప్పుడు ఇదిగో ఇలా...తెలుగులో అతిపెద్ద స్వీయ రచనగా వెలువరించిన ఘనత కూడా సాధించారు వల్లూరు శివప్రసాద్‌. కథకుడుగా ప్రారంభమై రాసిన 75 కథల్లో పాతిక కథలకు పలు బహుమతులు పొందారు. 30 నాటికలు, అనేక శ్రవ్య నాటికలు, పిల్లల నాటికాలు రాశారు. ఆయన నాటకాలకు నాలుగుసార్లు ఉత్తమ రచయితగా నందిబహుమతులు పొందారు. పలు సినిమాలకు రచనా సహకారం అందించారు కూడా. అభ్యుదయ భావాలకు కట్టుబడిన శివప్రసాద్‌ అరసం  రాష్ట్ర ప్రధానకార్యదర్శి. 

అన్నిటికీమించి నాటకరంగ చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న చరిత్రకారుడు శివప్రసాద్‌. తగినంత హాస్యం కూడా జోడించిన ఇందులోని పాతిక నాటికలూ ప్రేక్షకలోకంలో ప్రాచుర్యం పొందినవే. సమకాలీన వాస్తవికతలకు, నిజజీవితాలకు సమీపంగా ఉంటాయి. వందేళ్ళ తెలుగు నాటక సాహిత్య చరిత్రకు ఆయన రచనలు సజీవ సాక్ష్యాలనీ, ఆయన గురజాడ వారసుడనీ పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొనడం అతిశయోక్తి కానేరదు. 

 

 

25 నాటికలు
వల్లూరు శివప్రసాద్‌ 
ధర 350 రూపాయలు హార్డ్‌ బైండింగ్‌ 400 రూపాయలు
పేజీలు 560
ప్రతులకు  విశాలాంధ్ర,, నవచేతన బుక్‌హౌస్‌లు, నవోదయ, కాచిగూడ, హైదరాబాద్‌ 
ఫోన్‌ 040–23741620