పునరపి జననం, పునరపి మరణం అన్నారు. జీవితమనే మహానాటకంలో ఏది ముందు, ఏది తరువాత? అశాశ్వతమైన, సముద్రంలో నీటిబొట్టులాంటి మనిషి జీవిత గమ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. వీటికి సమాధానాల కోసం అన్వేషిస్తుంటారు కొంతమంది. అలాంటి అన్వేషకుడి కథే ఈ ‘ఆది- అంతం’. మరి అతనికి తన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయో లేదో నవల చదివి తెలుసుకోవాల్సిందే! 

-నర్మద.వి
ఆది-అంతం
నవల
పి. చంద్రశేఖర ఆజాద్‌
ధర: 150 రూపాయలు
పేజీలు: 240
ప్రతులకు: రచయిత, 
ఫ్లాట్‌ నెం. 909, సఫైర్‌ బ్లాక్‌, మైహోమ్‌ జ్యూయల్‌, మదీనాగూడ, 
మియాపూర్‌, హైదరాబాద్‌ -49.
సెల్‌: 092465 73575.