మానవీయతే ఎజెండా!

ఆకెళ్ళగా సుపరిచితులైన నాటకకర్త ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ పదిహేడు నాటకాలను రెండు సంపుటాలుగా వెలువరించారు. ఇందులో ప్రతి నాటకమూ ఏదో ఒక కేటగిరిలో నంది అవార్డు గెలుచుకున్నదే. కుటుంబ నేపథ్యంతో ‘కాకి ఎంగిలి’, స్త్రీల సమస్యలతో ‘క్రాస్‌ రోడ్స్‌, తెలంగాణ మాండలికంలోని ‘కలనేత’ వంటి చక్కటి నాటకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ వస్తు వైవిధ్యంతో, మానవతా విలువలతో సందేశాత్మకంగా ఉండి ఎక్కడైనా ప్రదర్శించడానికి అనువుగా రాసినవే. ‘స్వాతిముత్యం’, ‘శృతిలయలు’ వంటి జాతీయ అవార్డులు పొందిన సినిమాలకు రచయితగా పని చేసిన ఆకెళ్ళ ఈ నాటకాలన్నింటికీ చక్కటి సన్నివేశాల కూర్పు, కథకు తగిన పాత్ర చిత్రణ, సమయోచితమైన సంభాషణలు అందించారు.

- అజయ్‌

ఆకెళ్ల నాటకాలు (రెండు భాగాలు)

మొదటి సంపుటం: పేజీలు: 316,

వెల: రూ.300

రెండవ సంపుటం: పేజీలు: 351,

వెల: 350

ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన, నవోదయ