నెమరేయించే జ్ఞాపకాలు
 
రేడియో అనగానే గుర్తుకు వచ్చే కొద్దిమంది ప్రముఖులలో డి.వెంకట్రామయ్య ఒకరు. వ్యక్తిగత జీవితం లోని తీపి, చేదు అనుభవాలనే కాకుండా, ఆకాశవాణి తీరుతెన్నుల గురించి కూడా ఈ గ్రంథంలో ఆసక్తికరంగా, విమర్శనాత్మకంగా వివరించారు. న్యూస్‌ రీడర్‌ కాక ముందు ఎనౌన్సర్‌గా కూడా పనిచేసిన వెంకట్రామయ్య సుమారు నూట యాభై నాటికలూ, సీరియల్‌ నాటికలూ రాసి తానే ప్రయోక్తగా, ప్రధాన పాత్రధారిగా కూడా వ్యవహరించారు. రాంబాబు అన్న పేరుతో కార్మికుల కార్యక్రమం కూడా నిర్వహించారు. కొత్తదనం చూపించడంలోనూ, సరికొత్త ప్రయోగాలు చేయడంలోనూ అందెవేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్నారు. వార్తలు రాయడం, చదవడంతో పాటు చక్కని వ్యవహారశైలిలో ఎడిటింగ్‌ చేసి, ప్రసార మాధ్యమంలో తన కంటూ ఓ ప్రధాన స్థానాన్ని ఏర్పరచుకున్న వెంకట్రామయ్య... చక్కని భాషలో ఈ పుస్తకంలో తన అనుభవాలను పాఠకులకు పంచారు.
 - జి. రాజశుక

ఆకాశవాణిలో నా అనుభవాలు, 
డి. వెంకట్రామయ్య
పేజీలు : 302, వెల: రూ. 175
ప్రతులకు : ఎమెస్కో బుక్స్‌ ప్రై. లిమిటెడ్‌