జగమెరిగిన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. దాదాపు యాభై ఏళ్ళుగా తెలుగు పాఠకులను తన రచనలతో అలరిస్తున్నారాయన. 150నవలలు, తెలుగు, కన్నడ, హిందీ,తుళు భాషల్లో 24సినిమాలు, 10టెలిసీరియల్స్, 500కు పైగా ఆంగ్లకథల్ని అనువాదాలు రాశారాయన. 32 దేశాలు చుట్టివచ్చి రాసిన తొమ్మిది యాత్రి కథనాలతోపాటు ఆయన చిన్న కథల సంకలనం ‘కథకేళి’ సంస్కృతంలోకి అనువాదమైంది. ఇప్పుడు తాజాగా మల్లాది రాసిన మూడు పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ఒకటి ‘కనెక్ట్‌ టు గాడ్‌’ టైటిల్‌తో పిల్లల్లో భక్తిని ప్రేరేపించే 97 కథల పుస్తకం. మన పిల్లలు మంచి లక్షణాలతో పెరిగి పెద్దయి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా, ఉత్తమ వ్యక్తులుగా రాణించడానికి దోహదం చేసే పుస్తకమిది. 

 

కనెక్ట్‌ టు గాడ్‌
మల్లాది వెంకట కృష్ణమూర్తి 
ధర 210 రూపాయలు
పేజీలు 194
ప్రతులకు ప్రిజం బుక్స్‌, గాంధీనగరం పదోవీధి, హైదరాబాద్‌–80 ఫోన్‌ 040–276 129 28