‘క్రాస్‌రోడ్స్‌’ కథా సంకలనంలో 11 కథ లున్నాయి. ఇవన్నీ ఎనభయ్యోదశకంలో రాసిన కథలే. ‘ఒక తాత్త్వికసూత్రం చుట్టూ అల్లుకుని నడిచే విలక్షణ కథావస్తువులను సదాశివరావు ఎంచుకుంటారని’ నండూరి రామమోహన రావుగారు తన సమీక్షలో ఏనాడో కితాబిచ్చారు. ‘ఏ గూటిచిలుక ఆ గూటి ఆలోచనలకే పరిమితం’ అని చాటి చెప్పే టైటిల్‌ కథ ‘క్రాస్‌రోడ్స్‌’. భారతీయ జీవన స్రవంతిలో ఇమడలేక తిరిగి వెళ్ళిపోయిన అమెరికన్‌ హిప్పీ కథ ఇది. తన మృత్యువును పసిగట్టలేక పోయిన జ్యోతిష్కుని కథ ‘తాంత్రిక్‌ ఈవినింగ్‌’, గుర్రప్పందాల వెనకున్న మోసాల్ని చెప్పే ‘అశ్వమేథం’, డబ్బుతో కొనలేని మానవవిలువల గురించి ఆలస్యంగా గ్రహించిన బిలియనీర్‌ కథ ‘లాస్ట్‌ ట్రిప్‌’ సదాశివరావు విశిష్ట కథనశైలిని చాటిచెబుతాయి.

-లలితా త్రిపుర సుందరి

క్రాస్‌రోడ్స్‌కథా సంకలనం

కె.సదాశివరావు

ధర: 150 రూపాయలు, పేజీలు: 304

ప్రతులకు:సాహితి ప్రచురణలు, కాళేశ్వరరావురోడ్‌, సూర్యారావుపేట, విజయవాడ-02ఫోన్‌: 0866-2436643