కథ, నవల, నాటక రచయిత, నటుడు, దర్శకుడు తులసి బాలకృష్ణ. ఇప్పటికి ఆయన రాసిన 400 కథల్లో 100పైగా హాస్య కథలే! వీటిల్లోంచి ఎంపిక చేసిన 20 కథల సంపుటి ఈ తాజా పుస్తకం ‘గిలిగింతలు’. ఇవన్నీ హాస్యకథలేనని టైటిల్‌లో కొట్టొచ్చినట్టు తెలియడమేకాదు, అన్నీ అచ్చతెలుగింటి హాస్యకథలని, మనకు సాంత్వన చేకూర్చే పసందైన విందు అనీ చెప్పకనే చెబుతాయి. ఈ కథలు చదువుతుంటే, పరిసరాలు మరచిపోయి, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. 

గిలిగింతలు

తులసి బాలకృష్ణ‍
ధర 100 రూపాయలు
పేజీలు 160
ప్రతులకు రచయిత, ఫ్లాట్‌ నెం 204, లక్ష్మీనిలయం, రోడ్‌ 1, రాకీ టౌన్‌ కాలనీ, హైదరాబాద్‌–68
సెల్‌ 87 90 11 55 44, ప్రముఖ పుస్తక కేంద్రాలు