విద్యావంతురాలు, పలు పురస్కాలు పొందిన రచయిత్రి కన్నెగంటి ఆనసూయ. 250కి పైగా కథలు, మరో 150 బాలల కథలు, నవలు రాశారు. ఈ తాజా సంకలనంలోని పదిహేను కథలూ సమకాలీన సామాజిక పరిణామాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, మనుషుల అలవాట్లు, మానవీయ కోణాలను ప్రవహింపజేసేవే. మరో పుస్తకం బాలల కోసం రాసిన 15 కథల సంకలనం ‘స్నేహితులు’. పిల్లలను అలరించే సరికొత్త కథలు ఇవన్నీ. దురాశ, నమ్మకద్రోహం తగదని చెప్పేకథలు, జీవకారుణ్యం, స్నేహశీలత, ధర్మాచరణ వంటివి నేర్పే కథలే ఇందులోవన్నీ.

 

కరదీపికలు
కన్నెగంటి  అనసూయ
ధర 150 రూపాయలు పేజీలు 210
స్నేహితులు   బాలల కథలు
కన్నెగంటి  అనసూయ
ధర 120 రూపాయలు , పేజీలు 68
ప్రతులకు రచయిత్రి, 406, వింధ్య 4, కూకట్‌పల్లి వై జంక్షన్‌, జయభారతి గార్డెన్స్‌, హైదరాబాద్‌–18 
సెల్‌ 9246 541 249 మరియు నవోదయ, తెలుగు బుక్‌హౌస్‌, నవ చేతన,  నవతెలంగాణ.