పదిమంది తెలంగాణ కథకులపై రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ‘తెలుగు కథకులు–కథన రీతులు’ పేరిట నాలుగు సంపుటాలుగా పదేళ్ళక్రితం వచ్చిన పుస్తకంలో, ఈ పదిమంది  తెలంగాణ కథకులపై రాసిన వ్యాసాలను వెలికితీసి ఇప్పుడిలా ‘కథకుల తెలంగాణం’ పేరిట సంకలనంగా తెచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి, నెల్లూరు కేశవస్వామి, ఇల్లిందల సరస్వతీదేవి, ముదిగంటి సుజాతారెడ్డి,బోయ జంగయ్య తదితరులపై ప్రముఖులు రాసిన వ్యాసాలు ఇవన్నీ.

కథకుల తెలంగాణం

సంపాదకులు మధురాంతకం రాజారాం, సింగమనేని నారాయణ
ధర 100 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు నవచేతన బుక్‌హౌస్‌లు.